కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు?

దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు?

మీరు న్యూస్‌ పేపర్‌ చదివినప్పుడు, టీవీ చూసినప్పుడు, లేదా రేడియో విన్నప్పుడు నేరాలు గురించి, యుద్ధాలు, ఉగ్రవాదం గురించి చూస్తారు, వింటారు. బహుశా మీరు ఏదైనా అనారోగ్యంతో లేదా ప్రియమైనవాళ్లు ఎవరైనా చనిపోయి బాధపడుతూ ఉండవచ్చు.

ఇలా ఆలోచించండి:

  • నేను, నా కుటుంబం ఇలా ఉండాలనే దేవుడు కోరుకున్నాడా?

  • సమస్యలను పరిష్కరించుకోవడానికి నాకు సహాయం ఎక్కడ దొరుకుతుంది?

  • నిజమైన శాంతి ఎప్పుడైనా వస్తుందా?

బైబిలు ఈ ప్రశ్నలకు నమ్మదగిన జవాబులు ఇస్తుంది.

దేవుడు భూమి మీద అద్భుతమైన మార్పులు చేస్తాడని బైబిలు చెప్తుంది.

  • మనుషులకు ఇంక ఏ బాధ ఉండదు, ఎవ్వరూ ముసలివాళ్లు అవ్వరు లేదా చనిపోరు.—ప్రకటన 21:4

  • “కుంటివాళ్లు జింకలా గంతులేస్తారు.”—యెషయా 35:6

  • “గుడ్డివాళ్ల కళ్లు తెరవబడతాయి.”—యెషయా 35:5

  • చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారు.—యోహాను 5:28, 29

  • ఎవరికీ అనారోగ్యం ఉండదు.—యెషయా 33:24

  • భూమి మీద ఉన్నవాళ్లందరికీ సమృద్ధిగా ఆహారం ఉంటుంది.—కీర్తన 72:16

బైబిలు బోధిస్తున్న వాటి నుండి ప్రయోజనం పొందండి

మీరు ముందు పేజీల్లో చదివిన విషయాలు కలల్లో మాత్రమే జరుగుతాయని మీకు అనిపించవచ్చు. కానీ దేవుడు అతి త్వరలో భూమి మీద ఆ మార్పులు చేస్తానని మాట ఇచ్చాడు. ఆయన వాటిని ఎలా చేస్తాడో బైబిలు వివరిస్తుంది.

బైబిలు అంతకన్నా ఎక్కువే చేస్తుంది. మనం నిజమైన సంతోషాన్ని అనుభవించడానికి, జీవితాన్ని ఆనందించడానికి ఇప్పుడు ఏమి అవసరమో కూడా బైబిలు చెప్తుంది. మీకు బాధ కలిగించే విషయాల గురించి ఒకసారి ఆలోచించండి. వాటిలో డబ్బు లేదా కుటుంబ విషయాలు, ఆరోగ్యం బాగోకపోవడం, మీకు ఇష్టమైన వాళ్లు ఎవరైనా చనిపోవడం లాంటి విషయాలు ఉండవచ్చు. ఈ సమస్యల్ని ఎలా తట్టుకోవాలో బైబిలు మీకు చెప్తుంది. అంతేకాదు క్రింద ఉన్న ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం ద్వారా ఓదార్పును ఇస్తుంది:

మీరు ఈ పుస్తకాన్ని చదువుతున్నారు అంటే, మీకు బైబిలు ఏమి నేర్పిస్తుందో తెలుసుకోవాలనే కోరిక ఉందని తెలుస్తుంది. ఈ పుస్తకం మీకు తప్పకుండా సహాయం చేస్తుంది. ఇందులో ఉన్న పేరాలకు ప్రశ్నలు ఉన్నాయి. అవి మీరు బైబిల్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాయి. యెహోవాసాక్షులతో బైబిలు చర్చలను లక్షలమంది ఆనందించారు. మీరు కూడా ఆనందిస్తారని ఆశిస్తున్నాం. బైబిలు నేర్పించే విషయాల్ని మీరు తెలుసుకుంటుండగా దేవుని ఆశీర్వాదం మీకు ఉండాలని ఆశిస్తున్నాం.