కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

5

స్కూల్లో నన్ను ఎవరైనా ఏడిపిస్తుంటే నేనేం చేయాలి?

స్కూల్లో నన్ను ఎవరైనా ఏడిపిస్తుంటే నేనేం చేయాలి?

అది ఎందుకు ప్రాముఖ్యం?

ఆ సమయంలో మీరేం చేస్తారనేదాన్ని బట్టి, పరిస్థితి మెరుగవ్వవచ్చు లేక ఇంకా ఘోరంగా తయారవ్వవచ్చు.

మీరు ఏం చేస్తారు?

ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి: థామస్‌కి ఇవాళ స్కూల్‌కి వెళ్లాలని లేదు. రేపు కూడా వెళ్లాలని లేదు. అసలు ఎప్పటికీ వెళ్లాలనుకోవట్లేదు. ఎందుకంటే, స్కూల్‌లో పిల్లలు మూడు నెలల నుండి అతనిమీద లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నారు. అతణ్ణి నిక్‌నేమ్స్‌తో పిలుస్తున్నారు. కొన్నిసార్లయితే, కావాలనే తగిలి, అతని చేతిలో ఉన్న పుస్తకాలు కింద పడేసేవాళ్లు. కానీ అనుకోకుండా తగిలినట్లు నటించేవాళ్లు. కొన్నిసార్లు వెనక నుండి వచ్చి నెట్టేవాళ్లు. వెనక్కి తిరిగి చూస్తే ఒక పెద్ద గుంపు ఉండేది. వాళ్లలో ఎవరు తనను నెట్టారో థామస్‌కి అర్థమయ్యేది కాదు. నిన్న అయితే, మరీ దారుణంగా, మేసేజ్‌ల ద్వారా కూడా బెదిరించారు ...

థామస్‌ స్థానంలో మీరుంటే, ఏం చేస్తారు?

ఒక్కక్షణం ఆగి, ఆలోచించండి!

పరిస్థితులు పూర్తిగా మీ చేయిదాటిపోలేదు! నిజానికి, ఏడిపించేవాళ్లకు కొట్టకుండానే మీరు బుద్ధి చెప్పవచ్చు. ఎలా?

  • వాళ్లను ఏమీ అనకండి. బైబిలు ఇలా చెప్తుంది: ‘బుద్ధిహీనుడు తన కోపాన్నంతా చూపిస్తాడు జ్ఞానముగలవాడు కోపాన్ని అణచుకొని దాన్ని చూపించకుండా ఉంటాడు.’ (సామెతలు 29:11) వీలైనంతవరకు, మిమ్మల్ని ఏడిపిస్తున్నవాళ్లను మీరు (కనీసం పైకి మాత్రమైనా) ఏమీ అనకుండా ఉంటే, వాళ్లు వెనక్కి తగ్గుతారు.

  • ఎదురుతిరగకండి. బైబిలు ఇలా చెప్తుంది: ‘కీడుకు ప్రతి కీడు చేయవద్దు.’ (రోమీయులు 12:17) మీరు ఎదురుతిరిగితే పరిస్థితి ఇంకా ఘోరంగా తయారౌతుంది.

  • సమస్యకు దూరంగా ఉండండి. బైబిలు ఇలా చెప్తుంది: “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును” (సామెతలు 22:3) వీలైనంతవరకు, ఏడిపించేవాళ్ల దగ్గరికి వెళ్లకండి. అలాంటి పరిస్థితులకు దూరంగా ఉండండి.

  • సరదాగా ఉండండి. బైబిలు ఇలా చెప్తుంది: “మృదువైన మాట క్రోధమును చల్లార్చును.” (సామెతలు 15:1) మీరు సరదాగా ఉండడానికి ప్రయత్నించవచ్చు. ఉదాహరణకు, మీరు లావుగా ఉన్నారని వాళ్లు అంటే, దాన్ని సీరియస్‌గా తీసుకోకుండా “అవును, నాకూ అదే అనిపిస్తుంది. కాస్త బరువు తగ్గాలనుకుంటా!” అని అనవచ్చు.

  • మౌనంగా అక్కడనుండి వెళ్లిపోండి. నోరా అనే 19 ఏళ్ల అమ్మాయి ఇలా చెప్తుంది, “మీరు మౌనంగా ఉంటే, మీరు తెలివైనవాళ్లని, ఏడిపిస్తున్నవాళ్ల కంటే మీరే బలవంతులని చూపిస్తారు. అంతేకాదు మౌనంగా ఉండడం ద్వారా, ఏడిపించేవాళ్లకు లేని నిగ్రహం మీకుందని చూపిస్తారు.”—2 తిమోతి 2:24-26.

  • ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఏడిపించేవాళ్లు తరచూ, ఆత్మవిశ్వాసం లేనివాళ్లనే ఏడిపిస్తుంటారు. ఎందుకంటే, ఎన్ని మాటలన్నా అలాంటివాళ్లు తిరిగి ఏమీ అనలేరని వాళ్ల ఉద్దేశం. కానీ మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటే, మిమ్మల్ని ఏడిపించేవాళ్లు వెనక్కి తగ్గుతారు.

  • పెద్దవాళ్లకు చెప్పండి. ఒకప్పుడు స్కూల్‌ టీచర్‌గా పనిచేసిన ఒకరు ఇలా చెప్తున్నారు, “ఎవరైనా ఏడిపిస్తుంటే, దయచేసి పెద్దవాళ్లకు చెప్పండి. అలా చేయడమే సరైన పని. దానివల్ల, మిగతా పిల్లలు కూడా ఏడిపించేవాళ్ల బారిన పడకుండా తప్పించుకుంటారు.”

మీకు ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు, మిమ్మల్ని ఏడిపించేవాళ్ల కన్నా మీరే బలవంతులని చూపిస్తారు