కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 4

కోపం వల్ల హత్య

కోపం వల్ల హత్య

ఆదాము, హవ్వ తోటలో నుండి వెళ్లిపోయాక వాళ్లకు చాలామంది పిల్లలు పుట్టారు. వాళ్ల పెద్ద కొడుకు కయీను రైతు అయ్యాడు, రెండవ కొడుకు హేబెలు గొర్రెల కాపరి అయ్యాడు.

ఒకరోజు కయీను, హేబెలు యెహోవాకు అర్పణలు తెచ్చారు. అర్పణ అంటే ఏంటో మీకు తెలుసా? అది ఒక ప్రత్యేకమైన గిఫ్ట్‌. యెహోవా హేబెలు అర్పణకు సంతోషించాడు కానీ కయీను అర్పణకు సంతోషించలేదు. దానివల్ల కయీనుకు చాలా కోపం వచ్చింది. కయీను కోపంతో ఏదైనా చెడు చేసే ప్రమాదం ఉందని యెహోవా కయీనుకు ముందే చెప్పాడు. అయినా కయీను వినలేదు.

కయీను ‘నాతో పొలంలోకి రా’ అని హేబెలుతో అన్నాడు. పొలంలో వాళ్లిద్దరు మాత్రమే ఉన్నప్పుడు కయీను తమ్ముడి మీద దాడి చేసి అతనిని చంపేశాడు. ఇప్పుడు యెహోవా ఏమి చేస్తాడు? దానికి శిక్షగా యెహోవా కయీనును ఇంటినుండి దూరంగా పంపించేశాడు. కయీనుకు ఇంటికి తిరిగి వచ్చే అవకాశం ఇక లేదు.

దీని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? కొన్ని విషయాలు మనం అనుకున్నట్లు జరగకపోతే మనకు కోపం రావచ్చు. కోపం మన లోపల పెరుగుతుందని మనకే అనిపించవచ్చు, లేదా వేరేవాళ్లు మనలో కోపాన్ని చూసి మనల్ని జాగ్రత్తపడమని చెప్పవచ్చు. అప్పుడు వెంటనే కోపాన్ని ఆపుకోకపోతే మనం కోపం చేతిలో చిక్కుకుపోతాం.

హేబెలు యెహోవాను ప్రేమించి, మంచిగా ఉన్నాడు కాబట్టి యెహోవా ఎప్పుడూ ఆయన్ని గుర్తు పెట్టుకుంటాడు. దేవుడు భూమిని పరదైసుగా చేసినప్పుడు హేబెలును మళ్లీ బ్రతికిస్తాడు.

“ముందు నీ సోదరునితో సఖ్యత కుదుర్చుకో; తర్వాత తిరిగొచ్చి నీ అర్పణను అర్పించు.” —మత్తయి 5:24