కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 5

నోవహు ఓడ

నోవహు ఓడ

కొంత కాలానికి భూమి మీద మనుషులు పెరిగిపోయారు. వాళ్లలో చాలామంది చెడ్డవాళ్లే. పరలోకంలో కొంతమంది దూతలు కూడా చెడ్డవాళ్లు అయ్యారు. వాళ్లు ఉండే చోటును అంటే పరలోకాన్ని విడిచిపెట్టి ఆ దూతలు కింద భూమి మీదకు వచ్చారు. వాళ్లు అలా ఎందుకు వచ్చారో మీకు తెలుసా? మనుషుల్లా శరీరాలు మార్చుకుని ఇక్కడున్న ఆడవాళ్లను పెళ్లి చేసుకోవడానికి భూమి మీదకు వచ్చారు.

ఆ దూతలకు, స్త్రీలకు కొడుకులు పుట్టారు. ఆ కొడుకులు పెద్దవాళ్లై చాలా బలంగా అందరినీ పీడించే వాళ్లగా అయ్యారు. అందరినీ క్రూరంగా ఏడ్పించేవాళ్లు. వాళ్లు అలా చేస్తుంటే యెహోవా చూస్తూ ఊరుకోలేదు. అందుకే ఒక జలప్రళయాన్ని తెచ్చి చెడ్డవాళ్లందర్నీ నాశనం చేయాలనుకున్నాడు.

కానీ వాళ్లందరిలో ఒకతను వేరుగా ఉన్నాడు. ఆయన యెహోవాను ప్రేమించాడు. అతని పేరు నోవహు. అతనికి భార్య, ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్లు ఉన్నారు. నోవహు కొడుకుల పేర్లు షేము, హాము, యాపెతు. ఆ జలప్రళయం వచ్చినప్పుడు అతనిని, అతని కుటుంబాన్ని కాపాడుకోవడానికి పెద్ద ఓడ కట్టమని యెహోవా నోవహుతో చెప్పాడు. ఈ ఓడ నీళ్లలో తేలే పెద్ద చెక్క బాక్సులా ఉంటుంది. యెహోవా జంతువులను కాపాడడానికి వాటిని కూడా ఓడలోకి తెమ్మని నోవహుతో చెప్పాడు.

వెంటనే నోవహు ఓడ కట్టడం మొదలు పెట్టాడు. నోవహుకు అతని కుటుంబానికి ఆ ఓడను కట్టడానికి దాదాపు 50 సంవత్సరాలు పట్టింది. వాళ్లు సరిగ్గా యెహోవా చెప్పినట్లే ఆ ఓడను కట్టారు. ఆ సమయంలో జలప్రళయం వస్తుందని నోవహు ప్రజలకు చెప్పాడు. కానీ ఎవరూ ఆయన చెప్పేది వినలేదు.

చివరికి వాళ్లందరూ ఓడలోకి వెళ్లే సమయం వచ్చింది. ఆ తర్వాత ఏమి జరిగిందో చూద్దాం.

“మానవ కుమారుడి ప్రత్యక్షత నోవహు రోజుల్లాగే ఉంటుంది.”—మత్తయి 24:37