కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 6

ఎనిమిదిమంది కొత్తలోకంలోకి వెళ్లారు

ఎనిమిదిమంది కొత్తలోకంలోకి వెళ్లారు

నోవహు, అతని ఇంటివాళ్లు జంతువులతో ఓడలోకి వెళ్లారు. యెహోవా ఓడ తలుపును మూసేశాడు. వర్షం పడడం మొదలైంది. బాగా వర్షం కురుస్తూ ఉండడం వల్ల ఓడ నీళ్లలో తేలింది. నెమ్మదిగా భూమి అంతా నీళ్లతో నిండిపోయింది. ఓడ బయట ఉన్న చెడ్డ వాళ్లందరూ చచ్చిపోయారు. కానీ నోవహు అతని కుటుంబం ఓడ లోపల క్షేమంగా ఉన్నారు. యెహోవా మాట విన్నందుకు వాళ్లకు ఎంత సంతోషంగా అనిపించి ఉంటుందో ఆలోచించండి?

వర్షం 40 పగళ్లు, 40 రాత్రులు కురిసి ఆగిపోయింది. మెల్లగా నీళ్లు తగ్గుతూ ఉన్నాయి. చివరికి ఓడ కొండల మీదికి వచ్చి ఆగింది. కానీ చుట్టూ ఇంకా చాలా నీళ్లు ఉన్నాయి, కాబట్టి నోవహు అతని కుటుంబం ఓడలో నుండి వెంటనే బయటకు రాలేకపోయారు.

మెల్లమెల్లగా నీళ్లు ఎండిపోయాయి. నోవహు కుటుంబం సంవత్సరం కన్నా ఎక్కువే ఓడలో ఉన్నారు. తర్వాత ఓడలో నుండి బయటకు వచ్చి చెడ్డవాళ్లు లేని కొత్త లోకంలోకి వెళ్లమని యెహోవా వాళ్లకు చెప్పాడు. యెహోవా కాపాడినందుకు వాళ్లు చాలా కృతజ్ఞతతో ఉన్నారు. యెహోవాకు అర్పణ ఇచ్చి వాళ్లు కృతజ్ఞతను చూపించారు.

ఆ అర్పణ చూసి యెహోవా సంతోషించాడు. ఆయన మళ్లీ ఎప్పుడూ భూమి అంతటినీ జలప్రళయం ద్వారా నాశనం చేయనని మాట ఇచ్చాడు. ఆయన ఇచ్చిన మాటకు గుర్తుగా ఆకాశంలో మొదటిసారి రెయిన్‌బోను అంటే ఇంద్రధనస్సును వచ్చేలా చేశాడు. మీరు ఎప్పుడైనా ఇంద్రధనస్సు చూశారా?

అప్పుడు యెహోవా నోవహుతో అతని కుటుంబంతో పిల్లలను కని భూమిని నింపమని చెప్పాడు.

“నోవహు ఓడలోకి వెళ్లే రోజు వరకు . . . జలప్రళయం వచ్చి వాళ్లందర్నీ కొట్టుకొనిపోయే వరకు వాళ్లు ఏమీ పట్టించుకోలేదు.” —మత్తయి 24:38, 39