కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 19

మొదటి మూడు తెగుళ్లు

మొదటి మూడు తెగుళ్లు

ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల్ని బానిసలుగా ఎక్కువ పని చేయిస్తూ చాలా కష్టపెట్టారు. యెహోవా మోషేను, అహరోనును ఇలా చెప్పమని ఫరో దగ్గరకు పంపించాడు: ‘నా ప్రజలను పంపించు, అప్పుడు వాళ్లు అరణ్యంలో నన్ను ఆరాధిస్తారు.’ ఫరో గర్వంతో ఇలా జవాబిచ్చాడు: ‘యెహోవా ఏమి చెప్తే నాకేంటి, నేను ఇశ్రాయేలీయుల్ని పంపను.’ అప్పటినుండి ఫరో వాళ్లకు ఇంకా ఎక్కువ పని చెప్పి కష్టపెట్టాడు. అయితే యెహోవా ఫరోకు బుద్ధి చెప్పాడు. ఎలానో మీకు తెలుసా? ఆయన ఐగుప్తీయుల మీదికి పది తెగుళ్లు తెచ్చాడు. యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: ‘ఫరో నా మాట వినడం లేదు. ఉదయం అతను నైలు నది దగ్గర ఉంటాడు. ఆయన దగ్గరకు వెళ్లి, నా ప్రజలను నువ్వు వెళ్లనివ్వడం లేదు కాబట్టి నైలు నదిలో నీళ్లన్నీ రక్తంగా మారతాయి’ అని చెప్పు. మోషే దేవుని మాట విని ఫరో దగ్గరకు వెళ్లాడు. ఫరో చూస్తున్నప్పుడు అహరోను నైలు నదిని తన కర్రతో కొడతాడు, నది నీళ్లు రక్తంగా మారి, కంపు కొడతాయి, చేపలు చచ్చిపోతాయి. నైలు నదిలో తాగడానికి మంచి నీళ్లు ఉండవు. అయినా ఫరో ఇశ్రాయేలీయుల్ని వెళ్లనివ్వడు.

ఏడు రోజుల తర్వాత యెహోవా మోషేను మళ్లీ ఫరో దగ్గరకు పంపించి ఇలా చెప్పమంటాడు: ‘నువ్వు నా ప్రజలను పంపించకపోతే, ఐగుప్తు దేశమంతా కప్పలతో నిండిపోతుంది.’ అహరోను తన కర్రను ఎత్తాడు. అప్పుడు కప్పలు అన్ని చోట్ల వచ్చేస్తాయి. ప్రజల ఇళ్లల్లో, మంచాల మీద, గిన్నెల్లో కప్పలు ఉంటాయి. ఎక్కడ చూసినా కప్పలే! యెహోవా ఈ తెగులును ఆపేలా చేయమని ఫరో మోషేను బతిమాలాడు. అప్పుడు ఇశ్రాయేలీయుల్ని వెళ్లనిస్తానని ఫరో చెబుతాడు. యెహోవా తెగులును ఆపేసినప్పుడు ఐగుప్తీయులు కప్పలన్నిటిని కుప్పలుకుప్పలుగా పోగుచేస్తారు. దేశమంతా కంపు కొడుతుంది, కానీ ఫరో మాత్రం ప్రజలను వెళ్లనివ్వడు.

అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: ‘అహరోను తన కర్రతో నేలను కొట్టాలి, అప్పుడు దుమ్ము దోమలుగా లేదా కుట్టే ఈగలుగా అవుతుంది.’ వెంటనే ఎక్కడ చూసిన ఈగలు వచ్చేశాయి. కొంతమంది ఫరో ప్రజలే అతనితో ఇలా అంటారు: ‘ఈ తెగులు దేవుని నుండి వచ్చింది.’ అయినా కూడా ఫరో ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వడు.

“నా నామము యెహోవా అని వారు తెలిసికొనునట్లు . . . నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును.”—యిర్మీయా 16:21