కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 21

పదో తెగులు

పదో తెగులు

మళ్లీ కలవడానికి ప్రయత్నించనని మోషే ఫరోతో చెప్పాడు. కానీ వెళ్లే ముందు ఇలా చెప్తాడు: ‘మధ్యరాత్రి, ఐగుప్తీయుల ప్రతి కుటుంబంలో పెద్ద కొడుకు అంటే ఫరో కొడుకు నుండి పనివాడి కొడుకు వరకు చనిపోతారు.’

ఒక ప్రత్యేకమైన భోజనం చేయమని యెహోవా ఇశ్రాయేలీయులతో చెప్తాడు. ఆయన ఇలా చెప్తాడు: ‘ఒక సంవత్సరం వయసు ఉన్న మగ గొర్రెను లేదా మేకను చంపి, దాని రక్తాన్ని మీ తలుపులకు రాసుకోండి. మాంసాన్ని కాల్చి, పిండి పులవకుండా చేసిన రొట్టెలతో తినండి. బట్టలు, కాళ్లకు చెప్పులు వేసుకుని బయల్దేరడానికి సిద్ధంగా ఉండండి. ఈ రాత్రి మిమ్మల్ని ఐగుప్తు నుండి విడిపిస్తాను.’ ఇశ్రాయేలీయులు ఎంత ఆనందించి ఉంటారో ఊహించండి.

మధ్యరాత్రి యెహోవా దూత ఐగుప్తులో ఉన్న ప్రతీ ఇంటికి వెళ్లాడు. ఎవరి తలుపుకు రక్తం లేదో ఆ ఇంట్లో మొదటి బాబు చనిపోయాడు. కానీ ఎవరి తలుపుకు రక్తం ఉందో వాళ్లను దేవదూత ఏమి చేయలేదు. ఐగుప్తులో ప్రతీ కుటుంబం, గొప్పవాళ్లు, పేదవాళ్లు వాళ్ల పిల్లలను పోగొట్టుకున్నారు. కానీ ఇశ్రాయేలీయుల పిల్లల్లో ఒక్కరు కూడా చనిపోలేదు.

చివరికి ఫరో కొడుకు కూడా చనిపోయాడు. ఫరో ఇంక భరించలేకపోయాడు. వెంటనే మోషే, అహరోనులకు ఇలా చెప్పాడు: ‘ఇక్కడ నుండి వెంటనే వెళ్లిపోండి. వెళ్లి మీ దేవున్ని ఆరాధించుకోండి. మీ జంతువులను కూడా మీతో తీసుకుని వెళ్లిపోండి!’

పౌర్ణమి రోజున ఇశ్రాయేలీయులు కుటుంబాలుగా, గోత్రాలుగా ఐగుప్తు నుండి బయల్దేరారు. 6,00,000 మంది పురుషులు, చాలామంది స్త్రీలు, పిల్లలు కూడా ఉన్నారు. వాళ్లతోపాటు ఇశ్రాయేలీయులు కానివాళ్లు కూడా చాలామంది బయలుదేరారు, వాళ్లు కూడా యెహోవాను ఆరాధించాలని అనుకున్నారు. చివరికి ఇశ్రాయేలీయులకు విడుదల దొరికింది!

వాళ్లను యెహోవా ఎలా రక్షించాడో గుర్తుపెట్టుకోవడానికి వాళ్లు ప్రతి సంవత్సరం ఆ ప్రత్యేక భోజనం చేయాలి. దాన్ని ‘పస్కా’ అని పిలిచేవాళ్లు అంటే దాటి పోవడం అని అర్థం.

“నీ ద్వారా నా శక్తిని చూపించాలని, భూమంతటా నా పేరు ప్రకటించబడాలని నేను నిన్ను సజీవంగా ఉండనిచ్చాను.”—రోమీయులు 9:17