కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 27

వాళ్లు యెహోవాకు ఎదురు తిరిగారు

వాళ్లు యెహోవాకు ఎదురు తిరిగారు

ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్న కొంతకాలానికి కోరహు, దాతాను, అబీరాము ఇంకో 250 మంది మోషేకు ఎదురు తిరిగారు. వాళ్లు మోషేతో, ‘నువ్వు చేసింది ఇక చాలు! నువ్వు మా నాయకుడిగా, అహరోను మా ప్రధాన యాజకుడిగా ఎందుకు ఉండాలి? యెహోవా నీతో, అహరోనుతో మాత్రమే కాదు, మా అందరితో కూడా ఉన్నాడు’ అని అన్నారు. వాళ్లు అలా చేయడం యెహోవాకు నచ్చలేదు. ఆయన దాన్ని తనను ఎదిరించినట్లుగా చూశాడు.

మోషే కోరహుతో అతని వైపు ఉన్నవాళ్లతో ఇలా చెప్పాడు: ‘రేపు మీరు గుడారం దగ్గరకు రండి, మీతో పాటు పాత్రల్లో ధూపద్రవ్యాలను నింపుకొని తెచ్చుకోండి. ఎవర్ని ఎన్నుకున్నాడో యెహోవానే చూపిస్తాడు.’

తర్వాత రోజు కోరహు, ఆ 250 మంది గుడారం దగ్గర మోషేను కలవడానికి వెళ్తారు. యాజకుల్లా వాళ్లు ధూపాన్ని వేస్తారు. యెహోవా మోషే, అహరోనుతో ఇలా చెప్పాడు: ‘మీరు కోరహు, అతని దగ్గర ఉన్న మనుషుల నుండి వేరుగా వచ్చేయండి.’

గుడారం దగ్గరున్న మోషేను కలవడానికి కోరహు వెళ్లాడు కానీ దాతాను, అబీరాము, వాళ్ల కుటుంబ సభ్యులు దానికి కూడా ఒప్పుకోలేదు. యెహోవా ఇశ్రాయేలీయులను కోరహు, దాతాను, అబీరాము డేరాల నుండి దూరంగా వెళ్లిపోమని చెప్పాడు. వెంటనే ఇశ్రాయేలీయులు వెళ్లిపోయారు. దాతాను, అబీరాము వాళ్ల కుటుంబ సభ్యులు డేరాల బయట నిలబడి ఉన్నారు. ఒక్కసారిగా భూమి చీలిపోయి వాళ్లను మింగేసింది. గుడారం దగ్గర, అగ్ని వచ్చి కోరహును, అతనితో ఉన్న 250 మందిని కాల్చేసింది.

తర్వాత యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: ‘ప్రతి గోత్రం నాయకుడి దగ్గర నుండి ఒక కర్రను తీసుకుని, దానిమీద అతని పేరు రాయి. కానీ లేవి గోత్రం కర్ర మీద అహరోను పేరు రాయి. వాటిని గుడారం లోపల పెట్టండి, ఎవరి కర్రకు పూలు వస్తాయో అతన్నే నేను ఎన్నుకున్నాను.’

తర్వాత రోజు, మోషే కర్రలన్నిటిని బయటకు తీసుకుని వచ్చి వాటిని నాయకులకు చూపిస్తాడు. అహరోను కర్రకు పూలు వస్తాయి, దానికి పండిన బాదం కాయలు కూడా ఉంటాయి. అలా యెహోవా అహరోనును ప్రధాన యాజకుడిగా ఏర్పాటు చేసినట్లు చూపించాడు.

“మీలో నాయకత్వం వహిస్తున్నవాళ్ల మాట వింటూ వాళ్లకు లోబడి ఉండండి.”—హెబ్రీయులు 13:17