కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 47

యెహోవా ఏలీయాకు శక్తినిచ్చాడు

యెహోవా ఏలీయాకు శక్తినిచ్చాడు

బయలు ప్రవక్తలకు జరిగింది విని యెజెబెలుకు చాలా కోపం వచ్చింది. ఆమె ఏలీయాకు ఒక సందేశాన్ని పంపిస్తుంది: ‘బయలు ప్రవక్తలు చనిపోయినట్లే రేపు నువ్వు కూడా చనిపోతావు.’ ఏలీయాకు చాలా భయం వేసి ఎడారికి పారిపోతాడు. ఆయన ఇలా ప్రార్థన చేస్తాడు: ‘యెహోవా ఇక నావల్ల కాదు. నేను చచ్చిపోతాను.’ బాగా అలసిపోయి, ఏలీయా చెట్టు కింద నిద్రపోతాడు.

ఒక దేవదూత అతనిని నిద్ర లేపి నెమ్మదిగా ఇలా అంటాడు: ‘లేచి, భోజనం చేయి.’ ఏలీయా వేడిగా ఉన్న రాళ్లపై ఒక రొట్టెను, జగ్గులో నీళ్లను చూస్తాడు. ఆయన తిని, త్రాగి మళ్లీ నిద్ర పోతాడు. దేవదూత మళ్లీ అతనిని నిద్ర లేపి, ఇలా అన్నాడు: ‘తిను. నీ ప్రయాణం కోసం నీకు శక్తి కావాలి.’ అప్పుడు ఏలీయా ఇంకొన్ని తింటాడు. తర్వాత ఆయన 40 పగళ్లు, 40 రాత్రులు హోరేబు కొండ చేరుకునే వరకు ప్రయాణించాడు. అక్కడ నిద్రపోవడానికి ఏలీయా ఒక గుహలోకి వెళ్తాడు. కానీ యెహోవా అతనితో మాట్లాడి, ఇలా అంటాడు: ‘ఏలీయా, నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావ్‌?’ ఏలీయా ఇలా జవాబు ఇస్తాడు: ‘ఇశ్రాయేలీయులు నీకు ఇచ్చిన మాట తప్పారు. వాళ్లు నీ బలిపీఠాలను నాశనం చేసి, నీ ప్రవక్తలను చంపేశారు. ఇప్పుడు నన్ను కూడా చంపేయాలని చూస్తున్నారు.’

యెహోవా అతనితో ఇలా చెప్పాడు: ‘వెళ్లి కొండ మీద నిలబడు.’ మొదట, గుహ పక్కన బలమైన గాలి వీచింది. తర్వాత, భూకంపం, అగ్ని వచ్చాయి. చివరికి ఏలీయా, మెల్లగా చిన్నగా ఉన్న ఒక స్వరాన్ని విన్నాడు. తన ముఖాన్ని అంగీతో కప్పుకుని గుహ బయట నిలబడ్డాడు. ఎందుకు పారిపోయావని అతనిని యెహోవా అడిగాడు. ఏలీయా ఇలా చెప్పాడు: ‘నేను ఒక్కడినే మిగిలిపోయాను.’ కానీ యెహోవా అతనితో ఇలా అన్నాడు: ‘నువ్వు ఒక్కడివే కాదు. ఇశ్రాయేలులో నన్ను ఆరాధించే వాళ్లు ఇంకా 7,000 మంది ఉన్నారు. వెళ్లి నీ స్థానంలో ఎలీషాను ప్రవక్తగా నియమించు.’ వెంటనే, యెహోవా చెప్పినట్లు చేయడానికి ఏలీయా వెళ్తాడు. యెహోవా చెప్పింది చేస్తే ఆయన మీకు కూడా సహాయం చేస్తాడంటారా? అవును, చేస్తాడు. అయితే కరువు సమయంలో ఇంకేమి జరిగిందో చూద్దాం.

“ఏ విషయంలోనూ ఆందోళన పడకండి. కానీ ప్రతీ విషయంలో కృతజ్ఞతలు తెలుపుతూ ప్రార్థనల ద్వారా, అభ్యర్థనల ద్వారా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి.”—ఫిలిప్పీయులు 4:6