కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 74

యేసు మెస్సీయ అయ్యాడు

యేసు మెస్సీయ అయ్యాడు

యోహాను ‘నాకంటే గొప్ప అతను ఒకరు వస్తున్నారు’ అని ప్రకటిస్తూ ఉన్నాడు. యేసుకు 30 సంవత్సరాలప్పుడు గలిలయ నుండి యొర్దాను నది దగ్గరికి వచ్చాడు. అక్కడ యోహాను ప్రజలకు బాప్తిస్మం ఇస్తున్నాడు. యేసు తనకు బాప్తిస్మం ఇవ్వమని యోహానును అడిగాడు. కానీ యోహాను ‘నేను నీకు బాప్తిస్మం ఇవ్వకూడదు. నువ్వే నాకు బాప్తిస్మం ఇవ్వాలి’ అన్నాడు. యేసు యోహానుతో ఇలా చెప్పాడు: ‘నువ్వు నాకు బాప్తిస్మం ఇవ్వాలని యెహోవా కోరుకుంటున్నాడు.’ అప్పుడు వాళ్లు యొర్దాను నదిలోకి వెళ్లారు, అక్కడ యోహాను యేసును నీళ్లలో పూర్తిగా ముంచాడు.

యేసు నీళ్లలో నుండి బయటికి వచ్చాక ప్రార్థన చేశాడు. అప్పుడు ఆకాశం తెరుచుకుని దేవుని పవిత్రశక్తి పావురం రూపంలో అతనిపైకి వచ్చింది. తర్వాత యెహోవా పరలోకం నుండి ఇలా చెప్పాడు: ‘నువ్వు నా ప్రియమైన కుమారుడివి. నిన్ను చూసి నేను సంతోషిస్తున్నాను.’

యెహోవా పవిత్రశక్తి యేసుపై వచ్చినప్పుడు ఆయన క్రీస్తు లేదా మెస్సీయ అయ్యాడు. అప్పటి నుండి యెహోవా తనను ఏ పనికైతే భూమ్మీదకు పంపించాడో ఆ పనిని చేయడం మొదలుపెడతాడు.

బాప్తిస్మం అయిన వెంటనే యేసు అడవిలోకి వెళ్లి అక్కడ 40 రోజులు ఉన్నాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు, యోహానును చూడడానికి వెళ్లాడు. యేసు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, యోహాను ఇలా అన్నాడు: ‘లోకపు పాపాన్ని తీసేసే దేవుని గొర్రెపిల్ల ఇతనే.’ ఇలా చెప్పడం ద్వారా యేసే మెస్సీయ అని ప్రజలందరికీ యోహాను తెలిపాడు. యేసు అడవిలో ఉన్నప్పుడు అతనికి ఏం జరిగిందో మీకు తెలుసా? చూద్దాం.

‘అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది: “నువ్వు నా ప్రియమైన కుమారుడివి; నిన్ను చూసి నేను సంతోషిస్తున్నాను.”’—మార్కు 1:11