కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 76

యేసు ఆలయాన్ని శుభ్రం చేస్తాడు

యేసు ఆలయాన్ని శుభ్రం చేస్తాడు

క్రీ.శ. (క్రీస్తు శకం) 30వ సంవత్సరం వసంత కాలంలో అంటే బహుశా ఏప్రిల్‌ నెలలో యేసు యెరూషలేముకు వెళ్లాడు. పస్కా పండుగ చేసుకోవడానికి చాలామంది పట్టణానికి వచ్చారు. పండుగ చేసేటప్పుడు వాళ్లు జంతువుల్ని ఆలయంలో అర్పించేవాళ్లు. కొంతమంది జంతువుల్ని వాళ్లతోపాటు తెచ్చుకునేవాళ్లు, ఇంకొంతమంది యెరూషలేములో వాటిని కొనేవాళ్లు.

యేసు ఆలయానికి వెళ్లినప్పుడు కొంతమంది అక్కడ జంతువుల్ని అమ్మడం చూశాడు. వాళ్లు యెహోవాను ఆరాధించే స్థలంలో వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నారు. యేసు ఏం చేశాడు? ఆయన తాళ్లతో ఒక కొరడాని చేసి గొర్రెల్ని, పశువుల్ని ఆలయం నుండి బయటికి తరిమేశాడు. డబ్బు మార్చే వాళ్ల టేబుళ్లను తోసేసి, ఆ రూకల్ని నేల మీద పడేశాడు. పావురాల్ని అమ్మేవాళ్లతో యేసు, ‘వీటిని ఇక్కడ నుండి తీసుకెళ్లిపోండి. నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలంగా మార్చకండి’ అని అన్నాడు.

యేసు చేసింది చూసి ఆలయంలో ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు. ఆయన శిష్యులు మెస్సీయ గురించిన ఈ ప్రవచనాన్ని గుర్తుచేసుకున్నారు: ‘యెహోవా ఇంటి కోసం నేను చాలా ఆసక్తి చూపిస్తాను.’

తర్వాత క్రీ.శ. 33వ సంవత్సరంలో కూడా యేసు ఆలయాన్ని రెండవసారి శుభ్రం చేశాడు. ఎవరైనా తన తండ్రి ఇంటిని అగౌరవంగా చూస్తే యేసు ఊరుకోలేదు.

“మీరు . . . దేవునికీ డబ్బుకూ దాసులుగా ఉండలేరు.”—లూకా 16:13