కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

1వ సెక్షన్‌కు పరిచయం

1వ సెక్షన్‌కు పరిచయం

మన చుట్టూ ఉన్న సృష్టి గురించి చెప్తూ బైబిల్‌ మొదలవుతుంది. ఆకాశం, భూమితోపాటు యెహోవా చేసిన అందమైన వాటన్నిటిని బైబిల్‌ మనకు చూపిస్తుంది. మీరు తల్లిదండ్రులైతే, సృష్టిలో ఎన్ని రకాల జీవులు ఉన్నాయో తెలుసుకోవడానికి మీ పిల్లలకు సహాయం చేయండి. దేవుడు మనకు మాట్లాడే, ఆలోచించే, కొత్తకొత్త విషయాలు కనిపెట్టే, పాటలు పాడే, ప్రార్థన చేసే శక్తిని ఇచ్చాడు. అలా దేవుడు జంతువుల కన్నా మనుషుల్ని ఎంత గొప్పగా చేశాడో చూపించండి. యెహోవాకున్న శక్తి, తెలివి, ముఖ్యంగా మనందరితోపాటు సృష్టి అంతటి మీద ఆయనకున్న ప్రేమ ఎంత విలువైనవో అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి.

ఈ భాగంలో

లెసన్‌ 1

దేవుడు ఆకాశాన్ని భూమిని చేశాడు

దేవుడు ఆకాశాన్ని భూమిని చేశాడని బైబిల్‌ చెప్తుంది. కానీ దేవుడు అందరికన్నా అన్నిటికన్నా ముందు చేసిన దేవదూత ఎవరో మీకు తెలుసా?

లెసన్‌ 2

దేవుడు మొదటి పురుషుడిని, స్త్రీని చేశాడు

దేవుడు మొదటి పురుషుడిని, స్త్రీని చేసి వాళ్లను ఏదెను తోటలో పెట్టాడు. వాళ్లు పిల్లల్ని కని భూమి అంతటిని పరదైసులా చేయాలని దేవుడు కోరుకున్నాడు.