కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

2వ సెక్షన్‌కు పరిచయం

2వ సెక్షన్‌కు పరిచయం

అప్పుడున్న లోకాన్ని నాశనం చేయడానికి యెహోవా జలప్రళయాన్ని ఎందుకు తెచ్చాడు? మనుషుల చరిత్ర మొదట్లోనే ఒక యుద్ధం మొదలైంది—చెడుకు మంచికి మధ్య యుద్ధం. ఆదాము, హవ్వ, వాళ్ల కొడుకు కయీను చెడు వైపు ఉండాలని నిర్ణయించుకున్నారు. హేబెలు, నోవహు లాంటి ఇంకొంతమంది మంచి వైపు ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ చాలామంది బాగా చెడిపోయారు. అందుకే యెహోవా ఆ చెడ్డ లోకాన్ని అంతం చేశాడు. మనం ఎటు వైపు ఉండాలని నిర్ణయించుకుంటామో యెహోవా చూస్తాడని, ఆయన ఎప్పుడూ చెడుని మంచిపై గెలవనివ్వడని నేర్చుకోవడానికి ఈ సెక్షన్‌ మనకు సహాయం చేస్తుంది.

ఈ భాగంలో

లెసన్‌ 3

ఆదాము, హవ్వ దేవుని మాట వినలేదు

ఏదెను తోటలో ఉన్న ఆ చెట్టు ప్రత్యేకత ఏమిటి? దాని కాయను హవ్వ ఎందుకు తిన్నది?

లెసన్‌ 4

కోపం వల్ల హత్య

దేవుడు హేబెలు అర్పణను తీసుకున్నాడు కానీ కయీనుది తీసుకోలేదు. అది చూసి కయీనుకు చాలా కోపం వచ్చి చాలా భయంకరమైన పని చేశాడు.

5 సెక్షన్‌కు పరిచయం

నోవహు ఓడ

చెడ్డ దేవదూతలు భూమ్మీద ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకున్నప్పుడు, వాళ్లకు రాక్షసుల్లాంటి కొడుకులు పుట్టారు. ఎక్కడ చూసినా హింసే. కానీ నోవహు వేరుగా ఉన్నాడు. ఆయన దేవున్ని ప్రేమించాడు, ఆయనకు లోబడ్డాడు.

లెసన్‌ 6

ఎనిమిదిమంది కొత్తలోకంలోకి వెళ్లారు

జలప్రళయం వల్ల 40 పగళ్లు, 40 రాత్రులు వర్షం కురిసింది. నోవహు అతని కుటుంబం సంవత్సరం కన్నా ఎక్కువ కాలమే ఓడలో ఉన్నారు. చివరికి వాళ్లు బయటకు వచ్చారు.