కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

3వ సెక్షన్‌కు పరిచయం

3వ సెక్షన్‌కు పరిచయం

జలప్రళయం తర్వాత సంవత్సరాల్లో, యెహోవాను సేవించిన వాళ్ల పేర్లు బైబిల్లో చాలా తక్కువ ఉన్నాయి. దేవున్ని సేవించిన వాళ్లలో ఒకరు అబ్రాహాము, అతన్ని యెహోవా స్నేహితుడని అన్నారు. అతన్ని దేవుని స్నేహితుడని ఎందుకు అన్నారు? పిల్లల్ని యెహోవా స్వయంగా పట్టించుకుంటాడని, వాళ్లకు సహాయం చేయడం యెహోవాకు ఇష్టమని అర్థమయ్యేలా తల్లిదండ్రులు పిల్లలకు వివరించవచ్చు. అబ్రాహాము, ఇతర నమ్మకమైన వాళ్లయిన లోతు, యాకోబులా మనం కూడా ఏ భయం లేకుండా యెహోవా సహాయాన్ని అడగవచ్చు. యెహోవా ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటాడు అనే నమ్మకంతో మనం ఉండవచ్చు.

ఈ భాగంలో

లెసన్‌ 7

బాబెలు గోపురం

కొంతమంది ప్రజలు ఒక పట్టణాన్ని కట్టుకుని, ఆకాశాన్ని అంటుకునే ఒక గోపురాన్ని కట్టాలని అనుకున్నారు. కానీ దేవుడు ఉన్నట్టుండి వాళ్లు వేర్వేరు భాషలు మాట్లాడేలా ఎందుకు చేశాడు?

లెసన్‌ 8

అబ్రాహాము, శారా దేవుని మాట విన్నారు

అబ్రాహాము, శారా పట్టణంలో జీవితాన్ని వదులుకుని కనాను దేశంలో ఎందుకు తిరుగుతూ ఉన్నారు?

లెసన్‌ 9

చివరికి ఒక కొడుకు పుట్టాడు!

దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎలా నెరవేరుస్తాడు? అబ్రాహాము కొడుకుల్లో ఎవరి ద్వారా ఆ వాగ్దానం నెరవేరుతుంది? ఇస్సాకు ద్వారానా లేక ఇష్మాయేలు ద్వారానా?

లెసన్‌ 10

లోతు భార్యను గుర్తుపెట్టుకోండి

దేవుడు సొదొమ, గొమొర్రా మీద అగ్నిగంధకాలు కురిపించాడు. ఆ పట్టణాలు ఎందుకు నాశనం అయ్యాయి? మనమెందుకు లోతు భార్యను గుర్తుపెట్టుకోవాలి?

లెసన్‌ 11

విశ్వాసానికి పరీక్ష

దేవుడు అబ్రాహాముతో ‘దయచేసి, నీ ఒక్కగానొక్క కొడుకును తీసుకుని వెళ్లి మోరీయా ప్రాంతంలో ఒక కొండపైన నాకు బలిగా అర్పించు’ అన్నాడు. అబ్రాహాము విశ్వాసానికి వచ్చిన ఈ పరీక్షను ఎలా ఎదుర్కుంటాడు?

లెసన్‌ 12

స్వాస్థ్యం యాకోబుకు వచ్చింది

ఇస్సాకు రిబ్కాలకు ఇద్దరు కవలలు ఏశావు, యాకోబు పుట్టారు. ఏశావు ముందు పుట్టాడు కాబట్టి అతనికి ఒక ప్రత్యేకమైన స్వాస్థ్యం వచ్చే అవకాశం ఉంది. కానీ ఒక గిన్నె కూర కోసం అతను దానిని ఎందుకు వదులుకున్నాడు?

లెసన్‌ 13

యాకోబు ఏశావు కలిసిపోయారు

యాకోబు దేవదూత నుండి ఎలా దీవెనని తీసుకున్నాడు? ఏశావుతో యాకోబు ఎలా కలిసిపోయాడు?