కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

4వ సెక్షన్‌కు పరిచయం

4వ సెక్షన్‌కు పరిచయం

ఈ సెక్షన్‌లో మనం యోసేపు, యోబు, మోషే, ఇశ్రాయేలీయుల గురించి చూస్తాం. వీళ్లందరూ అపవాది అయిన సాతాను చేతిలో చాలా కష్టాలు పడ్డారు. వాళ్లలో కొంతమంది అన్యాయం, జైలు శిక్ష, బానిసత్వం, చివరికి మరణం కూడా చూడాల్సి వచ్చింది. కానీ ఎన్నో విధాలుగా యెహోవా వాళ్లను కాపాడాడు. ఆ సేవకులకు ఎంత చెడు జరిగినా యెహోవా మీద విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా ఎలా ఉన్నారో తల్లిదండ్రులు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పండి.

ఐగుప్తు దేవుళ్ల కంటే యెహోవాకు చాలా శక్తి ఉందని చూపించడానికి ఆయన పది తెగుళ్లను తెప్పించాడు. యెహోవా తన ప్రజలను ఆ రోజుల్లో ఎలా కాపాడాడో, ఇప్పుడు ఎలా కాపాడతాడో ముఖ్యంగా చెప్పండి.

ఈ భాగంలో

లెసన్‌ 14

దేవునికి లోబడి ఉన్న పనివాడు

యోసేపు మంచిపని చేసినా చాలా కష్టాలు పడ్డాడు. ఎందుకు?

లెసన్‌ 15

యెహోవా ఎప్పుడూ యోసేపును మర్చిపోలేదు

యోసేపు ఇంటికి చాలా దూరంగా ఉన్నా, దేవుడు అతనితో ఉన్నాడని చూపించాడు.

లెసన్‌ 16

యోబు ఎవరు?

కష్టంగా ఉన్నప్పుడు కూడా అతను యెహోవాకు లోబడి ఉన్నాడు.

లెసన్‌ 17

మోషే యెహోవాను ఆరాధించాలని నిర్ణయించుకున్నాడు

మోషే చిన్నగా ఉన్నప్పుడు, వాళ్ల అమ్మ తెలివైన పని వల్ల అతను కాపాడబడ్డాడు.

లెసన్‌ 18

మండుతున్న పొద

మంట ఎందుకు ఆ చెట్టును కాల్చేయలేదు?

లెసన్‌ 19

మొదటి మూడు తెగుళ్లు

ఫరో గర్వంతో ఒక చిన్న పని చేయడానికి ఒప్పుకోక తన ప్రజల మీదకు పెద్ద నాశనం తీసుకొచ్చాడు.

లెసన్‌ 20

చివరి ఆరు తెగుళ్లు

మొదట వచ్చిన మూడు తెగుళ్లకు ఇవి ఎలా వేరుగా ఉన్నాయి?

లెసన్‌ 21

పదో తెగులు

ఈ తెగులు ఎంత భయంకరమైనది అంటే గర్విష్ఠి అయిన ఫరో కూడా చివరికి తల వంచాల్సి వచ్చింది.

లెసన్‌ 22

ఎర్ర సముద్రం దగ్గర అద్భుతం

ఫరో పది తెగుళ్ల నుండి బయటపడ్డాడు కానీ దేవుడు చేసిన ఈ అద్భుతం నుండి తప్పించుకున్నాడా?