కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

5వ సెక్షన్‌కు పరిచయం

5వ సెక్షన్‌కు పరిచయం

ఎర్ర సముద్రం దాటిన రెండు నెలల తర్వాత, ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతానికి వచ్చారు. ఇశ్రాయేలీయులు ఆయనకు ప్రత్యేక ప్రజలుగా ఉంటారని యెహోవా అక్కడ ఒక ఒప్పందం చేశాడు. ఆయన వాళ్లను కాపాడాడు, వాళ్లకు అవసరమైనవన్నీ ఇచ్చాడు. తినడానికి మన్నా ఇచ్చాడు, వాళ్ల బట్టలు పాడైపోకుండా చూసుకున్నాడు, వాళ్లు డేరాల్లో ఉంటున్నప్పుడు సురక్షితంగా ఉండేలా చూసుకున్నాడు. మీరు తల్లిదండ్రులైతే, యెహోవా ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని, గుడారాన్ని, యాజకుల్ని ఎందుకు ఏర్పాటు చేశాడో పిల్లలకు అర్థమయ్యేలా చెప్పండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, పొగరుగా కాకుండా వినయంగా ఉండడం, యెహోవాకు ఎప్పుడూ నమ్మకంగా ఉండడం ఎంత ముఖ్యమో గుర్తుండిపోయేలా మీ పిల్లలకు చెప్పండి.

ఈ భాగంలో

లెసన్‌ 23

యెహోవాకు ఇచ్చిన మాట

సీనాయి కొండ దగ్గర ఉంటున్నప్పుడు ఇశ్రాయేలీయులు దేవునికి ఒక ప్రత్యేక వాగ్దానం చేశారు.

లెసన్‌ 24

వాళ్లు ఇచ్చిన మాట తప్పారు

మోషే పది ఆజ్ఞలను తీసుకుని వస్తుండగా ప్రజలు చాలా పెద్ద పాపం చేశారు.

లెసన్‌ 25

ఆరాధన కోసం గుడారం

ఈ ప్రత్యేక డేరాలో ఒప్పంద మందసం ఉంది.

లెసన్‌ 26

12 మంది గూఢచారులు

కనాను దేశాన్ని చూసి వచ్చిన వాళ్లలో కాలేబు, యెహోషువ వేరుగా ఉన్నారు.

లెసన్‌ 27

వాళ్లు యెహోవాకు ఎదురు తిరిగారు

కోరహు, దాతాను, అబీరాము, మిగతా 250 మంది యెహోవా గురించి ఒక ముఖ్యమైన వాస్తవాన్ని అర్థంచేసుకోలేక పోయారు.

లెసన్‌ 28

బిలాము గాడిద మాట్లాడుతుంది

బిలాముకు కనిపించని ఒకతన్ని గాడిద చూసింది.