కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

6వ సెక్షన్‌కు పరిచయం

6వ సెక్షన్‌కు పరిచయం

చివరికి ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి చేరుకున్నాక అక్కడ గుడారం నిజమైన ఆరాధనకు కేంద్రం అయ్యింది. యాజకులు ధర్మశాస్త్రాన్ని బోధించారు, న్యాయాధిపతులు దేశాన్ని నడిపించారు. ఈ సెక్షన్‌లో మన నిర్ణయాలు, మన పనులు వేరేవాళ్ల మీద ఎంత ప్రభావం చూపించవచ్చో తెలుస్తుంది. ప్రతి ఇశ్రాయేలీయుడు యెహోవాకు, తన సాటిమనిషికి నమ్మకంగా ఉండాలి. దెబోరా, నయోమి, యెహోషువ, హన్నా, యెఫ్తా కూతురు, సమూయేలు వాళ్ల చుట్టుప్రక్కల ఉన్న వాళ్లపై ఎలాంటి ప్రభావం చూపించారో మీ పిల్లలకు ముఖ్యంగా చెప్పండి. అంతేకాకుండా దేవుడు ఇశ్రాయేలీయులతో ఉన్నాడు అని తెలుసుకుని కొంతమంది ఇశ్రాయేలీయులు కానీ వాళ్లు అంటే రాహాబు, రూతు, యాయేలు, గిబియోనీయులు ఇశ్రాయేలీయుల వైపు ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం మీ పిల్లలకు గుర్తుండిపోయేలా చెప్పండి.

ఈ భాగంలో

లెసన్‌ 29

యెహోవా యెహోషువను ఎన్నుకున్నాడు

దేవుడు యెహోషువకు కొన్ని నియమాలు ఇచ్చాడు. అవి ఇప్పుడు మనకు కూడా సహాయం చేస్తాయి.

లెసన్‌ 30

రాహాబు గూఢచారులను దాచిపెట్టింది

యెరికో గోడలు కూలి పడిపోయాయి. కానీ అదే గోడ మీద ఉన్న రాహాబు ఇల్లు అలానే ఉంది.

లెసన్‌ 31

యెహోషువ, గిబియోనీయులు

‘సూర్యుడా, కదలకుండా నిలిచిపో’ అని యెహోషువ దేవున్ని అడుగుతూ ప్రార్థించాడు. దేవుడు జవాబిచ్చాడా?

లెసన్‌ 32

ఒక కొత్త నాయకుడు, ఇద్దరు ధైర్యవంతురాళ్లైన స్త్రీలు

యెహోషువ చనిపోయాక ఇశ్రాయేలీయులు విగ్రహాలను ఆరాధించడం మొదలుపెట్టారు. జీవితం చాలా కష్టమైపోయింది. కానీ న్యాయాధిపతియైన బారాకు నుండి, ప్రవక్త్రిని అయిన దెబోరా నుండి, యాయేలు, ఆమె డేరా మేకు నుండి సహాయం వచ్చింది.

లెసన్‌ 33

రూతు, నయోమి

భర్తలు చనిపోయిన ఇద్దరు స్త్రీలు ఇశ్రాయేలుకు తిరిగి వస్తారు. వాళ్లలో ఒకరైన రూతు పొలాల్లో పని చేయడానికి వెళ్తుంది, అక్కడ బోయజు ఆమెను చూస్తాడు.

లెసన్‌ 34

గిద్యోను మిద్యానీయులను ఓడిస్తాడు

మిద్యానీయులు ఇశ్రాయేలీయుల జీవితాన్ని చాలా కష్టమయ్యేలా చేశాక, ప్రజలు యెహోవా సహాయాన్ని వేడుకుంటారు. గిద్యోను చిన్న సైన్యం 1,35,000 శత్రు సైన్యాన్ని ఎలా ఓడించింది?

లెసన్‌ 35

హన్నా ఒక కొడుకు కోసం ప్రార్థన చేస్తుంది

ఎల్కానా హన్నాని, పెనిన్నాని, కుటుంబాన్ని గుడారం దగ్గర ఆరాధించడానికి షిలోహుకు తీసుకెళ్తాడు. అక్కడ, హన్నా ఒక కొడుకు కోసం ప్రార్థన చేస్తుంది. ఒక సంవత్సరం తర్వాత సమూయేలు పుట్టాడు!

లెసన్‌ 36

యెఫ్తా ఇచ్చిన మాట

యెఫ్తా ఏమని మాట ఇచ్చాడు, ఎందుకు? యెఫ్తా కూతురు తండ్రి ఇచ్చిన మాటకి ఎలా స్పందించింది?

లెసన్‌ 37

యెహోవా సమూయేలుతో మాట్లాడతాడు

ప్రధాన యాజకుడైన ఏలీ ఇద్దరు కొడుకులు గుడారం దగ్గర యాజకులుగా సేవ చేసేవాళ్లు, కానీ వాళ్లు యెహోవా నియమాలు పాటించలేదు. చిన్ని సమూయేలు అలా లేడు. యెహోవా అతనితో మాట్లాడాడు.

లెసన్‌ 38

యెహోవా సమ్సోనుకు బలాన్ని ఇచ్చాడు

సమ్సోను ఫిలిష్తీయులతో పోరాడడానికి దేవుడు శక్తిని ఇచ్చాడు. కానీ సమ్సోను ఒక చెడ్డ నిర్ణయం తీసుకున్నప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకుంటారు.