కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

7వ సెక్షన్‌కు పరిచయం

7వ సెక్షన్‌కు పరిచయం

ఈ సెక్షన్‌లో రాజైన సౌలు, రాజైన దావీదు జీవితాల గురించి 80 సంవత్సరాల చరిత్ర ఉంది. ముందు సౌలు దేవునికి భయపడుతూ వినయంగా ఉండేవాడు. కానీ కొంతకాలానికే మారిపోయాడు, యెహోవా చెప్పిన వాటిని పాటించడానికి ఒప్పుకోలేదు. కాబట్టి యెహోవా అతన్ని వదిలేశాడు. యెహోవా కొన్ని రోజులకు సమూయేలుతో ఇశ్రాయేలుకు తర్వాత రాజుగా దావీదును అభిషేకించమని చెప్పాడు. కుళ్లుబోతు అయిన సౌలు చాలాసార్లు దావీదును చంపడానికి ప్రయత్నించాడు. కానీ దావీదు తిరిగి పగ తీర్చుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. సౌలు కొడుకైన యోనాతానుకు యెహోవా దావీదును రాజుగా నిర్ణయించాడని తెలుసు, అందుకే అతను దావీదుకు నమ్మకంగా ఉన్నాడు. దావీదు ఎన్నో పెద్దపెద్ద పాపాలు చేశాడు, కానీ యెహోవా ఇచ్చే క్రమశిక్షణను ఎప్పుడూ కాదనలేదు. మీరు తల్లిదండ్రులైతే యెహోవా ఏర్పాట్లకు ఎప్పుడూ లోబడుతూ మద్దతు ఇవ్వడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవడానికి మీ పిల్లలకు సహాయం చేయండి.

ఈ భాగంలో

లెసన్‌ 39

ఇశ్రాయేలు మొదటి రాజు

ఇశ్రాయేలీయుల్ని నడిపించడానికి యెహోవా న్యాయాధిపతులను ఇచ్చాడు. కానీ వాళ్లు రాజు కావాలని అన్నారు. సమూయేలు సౌలుని మొదటి రాజుగా అభిషేకిస్తాడు. కానీ తర్వాత యెహోవా సౌలును రాజుగా తీసేశాడు. ఎందుకు?

లెసన్‌ 40

దావీదు, గొల్యాతు

ఇశ్రాయేలుకు తర్వాతి రాజుగా యెహోవా దావీదును ఎన్నుకున్నాడు, అది మంచి నిర్ణయమేనని దావీదు చూపిస్తాడు.

లెసన్‌ 40

దావీదు, సౌలు

వాళ్లలో ఒకరికి ఇంకొకరంటే ఎందుకు ద్వేషం. ద్వేషించబడిన అతను ఎలా ప్రవర్తించాడు?

లెసన్‌ 42

ధైర్యం, నమ్మకం చూపించిన యోనాతాను

రాజు కొడుకు దావీదుకు మంచి స్నేహితుడు అవుతాడు.

లెసన్‌ 43

దావీదు రాజు చేసిన పాపం

ఒక చెడ్డ నిర్ణయం వల్ల ఎన్నో ఇబ్బందులు వచ్చాయి.