కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

8వ సెక్షన్‌కు పరిచయం

8వ సెక్షన్‌కు పరిచయం

యెహోవా సొలొమోనుకు ఎంతో తెలివిని ఇస్తాడు, ఆలయాన్ని కట్టే గొప్ప అవకాశాన్ని కూడా ఇస్తాడు, కానీ నెమ్మదిగా అతను యెహోవాను విడిచిపెడతాడు. మీకు పిల్లలుంటే అబద్ధ ఆరాధకులు సొలొమోనును దేవుని నుండి ఎలా దూరం చేశారో వివరించండి. రాజ్యం విడిపోయింది, చెడ్డ రాజులు రాజ్యాన్ని మతభ్రష్టత్వంతో, విగ్రహారాధనతో నింపేశారు. ఈ సమయంలోనే యెహోవా నమ్మకమైన ప్రవక్తల్ని చాలామందిని హింసించి చంపేశారు. యెజెబెలు రాణి ఉత్తర రాజ్యాన్ని మరింత మతభ్రష్టత్వంతో నింపేసింది. ఇశ్రాయేలీయులు చరిత్రలో అది చీకటి కాలం. కానీ ఇశ్రాయేలీయుల్లో యెహోవాకు నమ్మకంగా ఉన్న సేవకులు ఇంకా ఎంతోమంది ఉన్నారు, వాళ్లలో రాజైన యెహోషాపాతు, ప్రవక్త అయిన ఏలీయా ఉన్నారు.

ఈ భాగంలో

లెసన్‌ 44

యెహోవాకు ఒక ఆలయం

దేవుడు సొలొమోను రాజు అడిగిన విన్నపాన్ని ఒప్పుకుంటాడు, వేరే గొప్ప పనులు ఇస్తాడు.

లెసన్‌ 45

రాజ్యం విడిపోయింది

చాలామంది ఇశ్రాయేలీయులు యెహోవాను ఆరాధించడం మానేశారు.

లెసన్‌ 46

కర్మెలు పర్వతం మీద పరీక్ష

నిజమైన దేవుడు ఎవరు? యెహోవానా లేదా బయలా?

లెసన్‌ 47

యెహోవా ఏలీయాకు శక్తినిచ్చాడు

ఆయన మీకు కూడా బలాన్ని ఇవ్వగలడని మీరు అనుకుంటున్నారా?

లెసన్‌ 48

ఒక విధవరాలి కొడుకు మళ్లీ బ్రతుకుతాడు

ఒకే ఇంట్లో రెండు అద్భుతాలు!

లెసన్‌ 49

దుష్ట రాణికి శిక్ష పడింది

యెజెబెలు నాబోతు ద్రాక్షతోటను దొంగిలించడం కోసం అతన్ని చంపించడానికి పథకం వేస్తుంది. ఆమె చెడుతనాన్ని యెహోవా చూశాడు.

లెసన్‌ 50

యెహోవా యెహోషాపాతును కాపాడతాడు

శత్రు దేశాలు యూదా దేశాన్ని బెదిరించినప్పుడు మంచి రాజైన యెహోషాపాతు ప్రార్థనలో దేవుని వైపు చూస్తాడు.