కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

9వ సెక్షన్‌కు పరిచయం

9వ సెక్షన్‌కు పరిచయం

ఈ సెక్షన్‌లో యెహోవా మీద గొప్ప విశ్వాసాన్ని చూపించిన యువకులు, ప్రవక్తలు, రాజులు గురించి చూస్తాం. సిరియా దేశంలో ఉంటున్న ఇశ్రాయేలీయురాలైన ఒక చిన్న పాప యెహోవా ప్రవక్త నయమానును బాగుచేస్తాడని నమ్మింది. ప్రవక్త అయిన ఎలీషా శత్రువు సైన్యం నుండి యెహోవా అతన్ని ఖచ్చితంగా కాపాడతాడని నమ్మాడు. ప్రధాన యాజకుడైన యెహోయాదా పసివాడైన యోవాషును అతని చెడ్డ నానమ్మ అతల్యా నుండి కాపాడడానికి తన ప్రాణాన్ని కూడా ప్రమాదంలో పడేసుకున్నాడు. యెహోవా యెరూషలేమును రక్షిస్తాడని రాజైన హిజ్కియా నమ్మి అష్షూరీయులు బెదిరించినా లొంగిపోలేదు. రాజైన యోషీయా దేశం నుండి విగ్రహారాధన తీసేసి, ఆలయాన్ని బాగు చేసి, దేశాన్ని సత్యారాధన వైపు నడిపించాడు.

ఈ భాగంలో

లెసన్‌ 51

ఒక సైన్యాధికారి, ఒక చిన్న పాప

ఒక ఇశ్రాయేలు అమ్మాయి యెహోవా గొప్ప శక్తి గురించి తన యజమానురాలికి చెప్తుంది. అప్పుడు అద్భుతమైన ఫలితాలు వచ్చాయి.

లెసన్‌ 52

యెహోవా అగ్ని గుర్రాలు, రథాలు

‘వాళ్ల దగ్గర కన్నా మన దగ్గరే ఎక్కువమంది ఉన్నారు’ అనే మాటలు నిజమని ఎలీషా సేవకునికి ఎలా తెలుస్తుంది?

లెసన్‌ 53

యెహోయాదా చూపించిన ధైర్యం

ఒక నమ్మకమైన యాజకుడు దుష్ట రాణిని ఎదిరిస్తాడు.

లెసన్‌ 54

యెహోవా యోనాతో ఓపికగా ఉన్నాడు

దేవుని ప్రవక్తని ఒక పెద్ద చేప ఎందుకు మింగింది? ఆయన ఎలా బయటకు వచ్చాడు? యెహోవా ఆయనకు ఏ పాఠం నేర్పించాడు?

లెసన్‌ 55

యెహోవా దేవదూత హిజ్కియాను కాపాడాడు

యెహోవా తన ప్రజలను కాపాడడని యూదా శత్రువులు చెప్తున్నారు కానీ అది నిజం కాదు!

లెసన్‌ 56

యోషీయా దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు

యోషీయాకు ఎనిమిది సంవత్సరాలప్పుడు రాజు అవుతాడు. యెహోవాను ఆరాధించేలా ఆయన ప్రజలకు సహాయం చేస్తాడు.