కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

10వ సెక్షన్‌కు పరిచయం

10వ సెక్షన్‌కు పరిచయం

అన్నిటిపైన యెహోవాయే రాజు. అన్నీ ఆయన అధీనంలోనే ఉన్నాయి, ఎప్పుడూ ఆయన కిందే ఉంటాయి. ఉదాహరణకు యిర్మీయా చనిపోకుండా యెహోవా అతనిని గుంటలోనుండి బయటకు తెచ్చాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోను అగ్నిగుండం నుండి కాపాడాడు, దానియేలును సింహాలు తినకుండా కాపాడాడు. ఎస్తేరును కాపాడి ఆమె తన ప్రజలందర్నీ రక్షించుకునేలా చేశాడు. చెడుతనాన్ని యెహోవా ఎప్పటికీ అలానే ఉండనివ్వడు. పెద్ద విగ్రహం, పెద్ద చెట్టు గురించిన ప్రవచనాలు యెహోవా రాజ్యం త్వరలో చెడు అంతటినీ తీసేసి భూమిని పరిపాలిస్తుందనే గట్టి నమ్మకాన్ని ఇస్తాయి.

ఈ భాగంలో

లెసన్‌ 57

యెహోవా యిర్మీయాను ప్రకటించడానికి పంపిస్తాడు

చిన్నవాడైన ఈ ప్రవక్త చెప్పిన మాటల వల్ల యూదా పెద్దలకు చాలా కోపం వచ్చింది.

లెసన్‌ 58

యెరూషలేము నాశనం అవుతుంది

యూదా ప్రజలు అబద్ధ దేవుళ్లను ఆరాధిస్తూనే ఉన్నారు కాబట్టి యెహోవా వాళ్లను వదిలేస్తాడు.

లెసన్‌ 59

యెహోవాకు లోబడిన నలుగురు అబ్బాయిలు

యూదా అబ్బాయిలు బబులోను రాజభవనంలో ఉన్నా కూడా యెహోవాకు నమ్మకంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

లెసన్‌ 60

ఎప్పటికీ ఉండిపోయే రాజ్యం

నెబుకద్నెజరుకు వచ్చిన విచిత్రమైన కలకు అర్థాన్ని దానియేలు చెప్తాడు.

లెసన్‌ 61

వాళ్లు సాగిలపడలేదు

షద్రకు, మేషాకు, అబేద్నెగో, బబులోను రాజు బంగారు విగ్రహాన్ని ఆరాధించడానికి ఒప్పుకోలేదు.

లెసన్‌ 62

పెద్ద చెట్టు లాంటి రాజ్యం

నెబుకద్నెజరు కల ఆయన సొంత భవిష్యత్తు గురించి చెప్తుంది.

లెసన్‌ 63

గోడ మీద రాసిన మాటలు

ఈ విచిత్రమైన మాటలు ఎప్పుడు కనిపిస్తాయి, వాటి అర్థం ఏంటి?

లెసన్‌ 64

సింహాల గుహలో దానియేలు

దానియేలులా, రోజూ యెహోవాకు ప్రార్థన చేయండి.

లెసన్‌ 65

ఎస్తేరు తన ప్రజలను కాపాడుతుంది

ఆమె వేరే దేశ స్త్రీ అయినప్పటికీ, అనాథ అయినప్పటికీ రాణి అవుతుంది.

లెసన్‌ 66

ఎజ్రా దేవుని ధర్మశాస్త్రాన్ని నేర్పించాడు

ఎజ్రా చెప్పేది విన్న తర్వాత, వాళ్లు దేవునికి ప్రత్యేక వాగ్దానం చేశారు.

లెసన్‌ 67

యెరూషలేము గోడలు

తన శత్రువులు దాడి చేయడానికి పథకం వేస్తున్నారని నెహెమ్యా తెలుసుకుంటాడు. ఆయన ఎందుకు భయపడలేదు?