కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

12వ సెక్షన్‌కు పరిచయం

12వ సెక్షన్‌కు పరిచయం

యేసు ప్రజలకు పరలోక రాజ్యం గురించి నేర్పించాడు. దేవుని పేరు పవిత్రపర్చాలని, ఆయన రాజ్యం రావాలని, భూమ్మీద ఆయన చిత్తం జరగాలని ప్రార్థించమని కూడా యేసు వాళ్లకు నేర్పించాడు. మీకు పిల్లలుంటే ఈ ప్రార్థనకు ఉన్న అర్థాన్ని చెప్పి, మన జీవితంలో అదెంత ముఖ్యమో వివరించండి. యేసు యెహోవాకు నమ్మకంగా ఉండకుండా సాతాను చేయాలనుకున్నాడు. కానీ, యేసు అతనికి అవకాశం ఇవ్వలేదు. యేసు తన అపొస్తలుల్ని ఎంపిక చేసుకున్నాడు. వాళ్లు దేవుని రాజ్యానికి మొదటి సభ్యులు అయ్యారు, వాళ్లకు ఆ రాజ్యంలో చాలా ముఖ్య పాత్ర ఉంది. నిజమైన ఆరాధన పట్ల యేసు ఎంత ఆసక్తి చూపించాడో చూడండి. యేసు అందరికీ సహాయం చేయాలని అనుకున్నాడు. అందుకే రోగుల్ని బాగు చేశాడు, ఆకలితో ఉన్నవాళ్లకు ఆహారం పెట్టాడు, చనిపోయినవాళ్లను కూడా తిరిగి బ్రతికించాడు. ఈ అద్భుతాలన్నీ చేసి, దేవుని రాజ్యం మనుషుల కోసం ఏమేం చేస్తుందో చూపించాడు.

ఈ భాగంలో

లెసన్‌ 74

యేసు మెస్సీయ అయ్యాడు

యేసు దేవుని గొర్రెపిల్ల అని యోహాను ఎందుకు చెప్పాడు?

లెసన్‌ 75

అపవాది యేసును పరీక్షిస్తాడు

మూడుసార్లు అపవాది యేసును పరీక్షిస్తాడు. ఆ మూడు పరీక్షలు ఏంటి? దానికి యేసు ఏం చేస్తాడు?

లెసన్‌ 76

యేసు ఆలయాన్ని శుభ్రం చేస్తాడు

యేసు ఆలయం నుండి జంతువుల్ని ఎందుకు బయటికి తరిమేశాడు? డబ్బు మార్చేవాళ్ల టేబుళ్లను ఎందుకు పడేశాడు?

లెసన్‌ 77

బావి దగ్గర స్త్రీ

సమరయ స్త్రీతో యాకోబు బావి దగ్గర యేసు మాట్లాడినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకు? ఎవ్వరితో చెప్పని ఒక విషయాన్ని యేసు ఆమెతో చెప్పాడు. ఏంటది?

లెసన్‌ 78

యేసు దేవుని రాజ్యం గురించి చెప్పాడు

తన శిష్యుల్లో కొంతమందిని ‘మనుషులను పట్టేవాళ్లుగా’ అవ్వడానికి ఆహ్వానిస్తాడు. తర్వాత సువార్త గురించిన సందేశాన్ని ప్రకటించడానికి తన శిష్యుల్లో 70 మందికి నేర్పిస్తాడు.

లెసన్‌ 79

యేసు ఎన్నో అద్భుతాలు చేశాడు

అతను ఎక్కడికి వెళ్లినా అనారోగ్యంగా ఉన్నవాళ్లు సహాయం కోసం అతని దగ్గరికి వచ్చేవాళ్లు, అప్పుడు అతను వాళ్లను బాగు చేశాడు. చనిపోయిన ఒక చిన్న పాపను కూడా తిరిగి బ్రతికించాడు.

లెసన్‌ 80

యేసు పన్నెండు మంది అపొస్తలులు

ఆయన వాళ్లను దేనికి ఎన్నుకున్నాడు? వాళ్ల పేర్లు మీకు గుర్తున్నాయా?

లెసన్‌ 81

కొండ మీద ప్రసంగం

అక్కడకు వచ్చిన ప్రజలకు యేసు విలువైన పాఠాలు నేర్పిస్తాడు.

లెసన్‌ 82

ప్రార్థన ఎలా చేయాలో యేసు శిష్యులకు నేర్పిస్తాడు

ఏ విషయాల కోసం అడుగుతూ ఉండాలని యేసు శిష్యులకు నేర్పిస్తాడు?

లెసన్‌ 83

యేసు వేలమందికి ఆహారం పెట్టాడు

ఈ అద్భుతం యేసు గురించి యెహోవా గురించి ఏమి చూపిస్తుంది?

లెసన్‌ 84

యేసు నీళ్ల మీద నడుస్తాడు

ఈ అద్భుతం చూసినప్పుడు అపొస్తలులకు ఎలా అనిపించి ఉంటుందో మీరు ఊహించగలరా?

లెసన్‌ 85

యేసు విశ్రాంతి రోజున జబ్బుల్ని తగ్గించాడు

ఆయన చేస్తున్న వాటి గురించి అందరూ ఎందుకు సంతోషంగా లేరు?

లెసన్‌ 86

యేసు లాజరును లేపుతాడు

మరియ ఏడవడం చూసి యేసు కూడా ఏడవడం మొదలుపెడతాడు. కానీ ఆ కన్నీళ్లు కాసేపట్లో సంతోషంగా మారిపోతాయి.