కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

14వ సెక్షన్‌కు పరిచయం

14వ సెక్షన్‌కు పరిచయం

తొలి క్రైస్తవులు దేవుని రాజ్య సువార్తను భూమి మీద దూర ప్రాంతాలకు ప్రకటించారు. యేసు వాళ్లు ఎక్కడ ప్రకటించాలో చెప్పాడు, అద్భుతంగా ప్రజల సొంత భాషల్లో నేర్పించేలా చేశాడు. యెహోవా వాళ్లకు ధైర్యాన్ని, ఘోరమైన హింసలు ఎదుర్కొనే శక్తిని ఇచ్చాడు.

యేసు అపొస్తలుడైన యోహానుకు యెహోవా మహిమను గూర్చిన దర్శనాన్ని ఇచ్చాడు. మరో దర్శనంలో, పరలోక రాజ్యం సాతానును ఓడించడం, అతని అధికారం అంతమైపోవడం యోహాను చూశాడు. యేసు 1,44,000 సహపరిపాలకులతో రాజుగా పరిపాలించడాన్ని యోహాను చూశాడు. భూమంతా పరదైసుగా మారడాన్ని, ప్రతి ఒక్కరు శాంతితో, ఐక్యంగా యెహోవాను ఆరాధించడాన్ని కూడా యోహాను చూశాడు.

ఈ భాగంలో

లెసన్‌ 94

శిష్యులు పవిత్రశక్తిని పొందారు

పవిత్రశక్తి వాళ్లకు ఏ అద్భుతమైన శక్తిని ఇచ్చింది?

లెసన్‌ 95

వాళ్లను ఏదీ ఆపలేదు

యేసును చంపిన మతనాయకులు ఇప్పుడు శిష్యులను పరిచర్య చేయకుండా ఆపడానికి ప్రయత్నించారు. కానీ వాళ్లు ఆపలేరు.

లెసన్‌ 96

యేసు సౌలును ఎన్నుకున్నాడు

సౌలు క్రైస్తవులకు బద్ధశత్రువు, కానీ ఆయన మారబోతున్నాడు.

లెసన్‌ 97

కొర్నేలి పవిత్రశక్తిని పొందాడు

యూదుడు కాని ఇతని ఇంటికి దేవుడు పేతురును ఎందుకు పంపిస్తాడు?

లెసన్‌ 98

క్రైస్తవ మతం చాలా దేశాలకు విస్తరించింది

అపొస్తలుడైన పౌలు, అతనితో మిషనరీ పనిచేస్తున్న సహోదరులు దూర దేశాల్లో ప్రకటనా పని మొదలుపెట్టారు.

లెసన్‌ 99

ఒక జైలు అధికారి సత్యం నేర్చుకుంటాడు

ఈ కథలో ఒక చెడ్డదూత, ఒక భూకంపం, ఒక పెద్ద కత్తి ఉన్నాయి. కథలో వీటన్నిటితో ఏం జరిగింది?

లెసన్‌ 100

పౌలు, తిమోతి

ఈ ఇద్దరు స్నేహితులుగా, తోటి సేవకులుగా ఎన్నో సంవత్సరాలు కలిసి పని చేశారు.

లెసన్‌ 101

పౌలును రోముకు పంపించారు

ప్రయాణంలో చాలా ప్రమాదాలు ఉన్నా అపొస్తలుడైన పౌలు ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు.

లెసన్‌ 102

యోహానుకు వచ్చిన దర్శనాలు

భవిష్యత్తు గురించి యేసు అతనికి వరుసగా దర్శనాలు ఇస్తాడు.

లెసన్‌ 103

“నీ రాజ్యం రావాలి”

దేవుని రాజ్యం భూమ్మీద జీవితాన్ని ఎలా మారుస్తుందో యోహానుకు వచ్చిన దర్శనాలు చూపిస్తాయి.