పాట 9
యెహోవా మన రాజు!
-
1. యెహోవా నీతిని చాటుతూ
ఆయనను స్తుతిస్తోంది ఆకాశం.
ఆయన అద్భుత క్రియల్ని చాటిస్తూ
ఆనందంతో స్తుతి చెల్లిద్దాం.
(పల్లవి)
ఆకాశం, భూలోకం పాడాలానందంతో
యెహోవాయే రాజయ్యాడని!
ఆకాశం, భూలోకం హర్షాతిరేకంతో
యెహోవాకు స్తుతి పాడాలి!
-
2. యెహోవా మన రక్షకుడు,
ఆయన మహిమను ప్రకటిద్దాం.
ఆయనే రారాజు, స్తుతికి పాత్రుడు;
విధేయులై ఉందాము మనం!
(పల్లవి)
ఆకాశం, భూలోకం పాడాలానందంతో
యెహోవాయే రాజయ్యాడని!
ఆకాశం, భూలోకం హర్షాతిరేకంతో
యెహోవాకు స్తుతి పాడాలి!
-
3. నీతియుక్త రాజ్యం స్థాపించి
రాజుగా నియమించాడు క్రీస్తును.
లోక దేవుళ్లంతా తలవంచుతారు;
యెహోవాయే స్తుతికర్హుడు.
(పల్లవి)
ఆకాశం, భూలోకం పాడాలానందంతో
యెహోవాయే రాజయ్యాడని!
ఆకాశం, భూలోకం హర్షాతిరేకంతో
యెహోవాకు స్తుతి పాడాలి!
(1 దిన. 16:9; కీర్త. 68:20; 97:6, 7 కూడా చూడండి.)