పాట 19
ప్రభువు రాత్రి భోజనం
-
1. మహోన్నతుడైన యెహోవా,
ఇదెంతో పవిత్ర రాత్రి.
ఎంతోకాలం క్రితం ఇదే రోజు రాత్రి
నిరూపించావు నీ శక్తి.
సంరక్షించావు నీ ప్రజల్ని,
పస్కా గొర్రెపిల్ల ద్వారా.
ఆ తర్వాత యేసు దాని స్థానంలోనే
అర్పించాడు మాకై ప్రాణాన్ని.
-
2. గుర్తు చేస్తాయి ఈ చిహ్నాలు,
నువ్వు చేసిన త్యాగాన్ని;
నీ కుమారుడైన యేసు చూపించిన
సంపూర్ణ విధేయతను.
కృతజ్ఞులమై ఉన్నాం మేము;
ధ్యానిస్తాము నీ ప్రేమను.
పాపమరణాల బానిసత్వం నుండి
విడిపించావు మా అందర్నీ.
-
3. నీ ఆహ్వానాన్ని అందుకుని,
స్తుతించ వచ్చాము నిన్ను.
క్రీస్తును పంపిన నీ గొప్ప ప్రేమను
సదా కొనియాడతాము.
గుర్తు చేసుకుంటాం ఎప్పుడూ
క్రీస్తు చేసిన త్యాగము.
నడుస్తాం ఆయన అడుగుజాడల్లో
పొందేలా నిత్య జీవితము.
(లూకా 22:14-20; 1 కొరిం. 11:23-26 కూడా చూడండి.)