కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

24వ పాట

యెహోవా పర్వతానికి రండి

యెహోవా పర్వతానికి రండి

(యెషయా 2:2-4)

  1. 1. ఎంతో ఎత్తయిన

    పర్వతాన్ని చూడండి.

    ఉంది శిఖరం పైన

    యెహోవా ఆలయం.

    గొప్ప ప్రవాహంలా

    వస్తున్నారు ప్రజలు,

    ‘రండి, సేవిద్దాం మనం

    యెహోవాను’ అంటూ.

    ఒంటరివాడిని

    వెయ్యిగా చేశాడు దేవుడు.

    ఔతుంది రుజువు,

    యెహోవా నిర్దేశం ఉందని.

    నేడు వస్తున్నారు

    లక్షలాది ప్రజలు,

    తమ సర్వాధిపతి

    యెహోవాయే అంటూ.

  2. 2. ప్రకటించమని

    ఆదేశించాడు క్రీస్తు.

    నేడు రాజ్యసువార్త

    చేరుతోందంతటా.

    ‘రండి నావైపుకు’

    అంటున్నాడు ప్రభువు.

    వాక్యం నిర్దేశిస్తుంది

    వచ్చే దీనులను.

    ఎంతటి సంతోషం,

    గొప్పసమూహాన్ని చూడడం!

    బోధిస్తాం అందరం,

    యెహోవా దేవుని గురించి.

    అంతా గళమెత్తి

    ఆహ్వానిద్దాం ప్రజల్ని:

    ‘రండి, యెహోవా

    పర్వతానికి అందరూ.’