పాట 35
‘ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో తెలుసుకోండి’
-
1. ఎంతో ముఖ్యం మనకీ
తెలివి, జ్ఞానం సంపాదించడం.
మంచి, చెడు తెలుసుకోవడం
నేడు మరీ ప్రాముఖ్యం.
(పల్లవి)
చెడే తుంచి
చేద్దాం మంచి
దైవం మెచ్చి
కుమ్మరిస్తుంటే దీవెనలను!
నేర్చుకుందాం
ప్రాముఖ్యమైంది సంతోషంగా.
-
2. మండే సత్యం మదిలో వెలుగై నిత్యం
తోడైవుంటుంది
ముత్యం సొంతం చేస్తుంది ఇకపై రోజు
స్వేచ్ఛా స్వాతంత్ర్యం.
(పల్లవి)
చెడే తుంచి
చేద్దాం మంచి
దైవం మెచ్చి
కుమ్మరిస్తుంటే దీవెనలను!
నేర్చుకుందాం
ప్రాముఖ్యమైంది సంతోషంగా.
-
3. దైవ రాజ్యం గురించి చెప్పడం నేడు
అత్యవసరం,
దైవ స్నేహం చేసేలా సహాయం చేద్దాం
అనునిత్యము.
(పల్లవి)
చెడే తుంచి
చేద్దాం మంచి
దైవం మెచ్చి
కుమ్మరిస్తుంటే దీవెనలను!
నేర్చుకుందాం
ప్రాముఖ్యమైంది సంతోషంగా.
(కీర్త. 97:10; యోహా. 21:15-17; ఫిలి. 4:7 కూడా చూడండి.)