కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

38వ పాట

ఆయనే నిన్ను బలపరుస్తాడు

ఆయనే నిన్ను బలపరుస్తాడు

(1 పేతురు 5:10)

  1. 1. సరైనది చేయాలనే ఆ కోరిక

    చూశాడు నాడే నీలో దేవుడు.

    చీకటిలో నుండి వెలుగు వైపుకు

    నడిపించాడు ప్రేమతో నిన్ను.

    నీ చిత్తం చేస్తానని మాటిచ్చావ్‌;

    విడువడు నీ చేయి ఎన్నడూ.

    (పల్లవి)

    క్రీస్తు రక్తంతో నిన్ను

    కొన్నాడు కాబట్టి

    తానే స్థిరపర్చి,

    బలపరుస్తాడు.

    ఇస్తాడు నిర్దేశాన్ని

    కాపాడుతూ నిన్ను;

    తానే స్థిరపర్చి,

    బలపరుస్తాడు.

  2. 2. తన కుమారుణ్ణి అర్పించడానికి

    సంకోచించనే లేదు ఏమాత్రం.

    ప్రియ కుమారుణ్ణి ఇచ్చిన దేవుడే,

    ఇస్తాడు నీకు బలాన్ని కూడా.

    సంరక్షిస్తాడు తన పిల్లల్ని;

    మరువడు విశ్వాస ప్రేమల్ని.

    (పల్లవి)

    క్రీస్తు రక్తంతో నిన్ను

    కొన్నాడు కాబట్టి

    తానే స్థిరపర్చి,

    బలపరుస్తాడు.

    ఇస్తాడు నిర్దేశాన్ని

    కాపాడుతూ నిన్ను;

    తానే స్థిరపర్చి,

    బలపరుస్తాడు.