పాట 44
ఒక దీనుడి ప్రార్థన
-
1. యెహోవా దేవా, నీకే నేను
ప్రార్థిస్తున్నాను.
మానని గాయాలెన్నో నన్ను
బాధిస్తున్నాయి.
తీరని కష్టాలెన్నో నన్ను
చుట్టుముట్టాయి.
ఓదార్పు కోసం నీ వైపే నే
చూస్తూ ఉన్నాను.
(పల్లవి)
సహించేలా సాయం చేయి.
నింపు నాలో నమ్మకాన్ని.
నిరాశలో ఉన్నా నేను;
నీవే నాకు శక్తినివ్వు.
-
2. నీ వాక్యమే ఇస్తుంది నాకు
ఎంతో ఊరట;
మాటల్లో చెప్పలేని భావాల్ని
బోధిస్తుంది.
నింపు నాలో నీ వాక్యంతో
విశ్వాసం, నమ్మకం.
తండ్రీ, నీ ప్రేమే గొప్పది నా
హృదయం కన్నా.
(పల్లవి)
సహించేలా సాయం చేయి.
నింపు నాలో నమ్మకాన్ని.
నిరాశలో ఉన్నా నేను;
నీవే నాకు శక్తినివ్వు.
(కీర్త. 42:6; 119:28; రోమా. 8:26; 2 కొరిం. 4:16; 1 యోహా. 3:20 కూడా చూడండి.)