పాట 63
మేము యెహోవాసాక్షులం!
-
1. చెక్కలతో, రాళ్లతో
చేస్తారు ప్రతిమల్ని.
గుర్తించనే లేదు
సత్యదేవుణ్ణి.
భవిష్యత్తు ఏమిటో
ఆ దేవుళ్లెరుగరు.
సాక్షుల్లేరు వారెవ్వరికీ,
చూపించలేరు దైవత్వం.
(పల్లవి)
మేం యెహోవాసాక్షులం,
ప్రకటిస్తాం మానక.
మా దేవుని ప్రవచనము
నెరవేరు తప్పక.
-
2. మా దేవుని నామాన్ని
సగర్వంగా చాటుతాం.
రాజ్య సందేశాన్ని
ధైర్యంగా చెప్తాం.
సత్యం స్వతంత్రులను
చేస్తుందని బోధిస్తాం.
దేవుని గూర్చి నేర్చుకుని,
స్తుతిస్తారు ఆయనను.
(పల్లవి)
మేం యెహోవాసాక్షులం,
ప్రకటిస్తాం మానక.
మా దేవుని ప్రవచనము
నెరవేరు తప్పక.
-
3. సాక్ష్యం తీసివేస్తుంది
దేవునిపై నిందల్ని.
దైవదూషకుల్ని
హెచ్చరిస్తుంది.
దాన్ని విని మారితే,
మన్నిస్తాడు దేవుడు.
నిండు మనసుతో సేవిస్తే,
ఎంతో సంతోషం పొందుతాం.
(పల్లవి)
మేం యెహోవాసాక్షులం,
ప్రకటిస్తాం మానక.
మా దేవుని ప్రవచనము
నెరవేరు తప్పక.
(యెష. 37:19; 55:11; యెహె. 3:19 కూడా చూడండి.)