పాట 70
అర్హుల్ని వెదకండి
-
1. సువార్త పని నేర్పించాడు యేసు,
నిర్దేశాలెన్నో ఇచ్చాడు:
‘దేవుని నిర్దేశం కోసం తపించే
వాళ్లను వెదకండి మీరు.
ఇంటిలో ఉన్న వాళ్లు అర్హులైతే,
మీ శాంతి వెళ్తుంది వాళ్లకు.
కానీ వాళ్లు వెళ్లిపొమ్మని అంటే,
శాంతంగా వచ్చేయండి మీరు.’
-
2. ఇంటివాళ్లు చేర్చుకుంటే మిమ్మల్ని,
చేర్చుకున్నట్టే ఆయన్ని.
సరైన మనసున్న వాళ్లందరూ
సేవచేస్తారు మీతో కల్సి.
చింతించకండి ఏం మాట్లాడాలని,
యెహోవాయే చేస్తాడు సాయం.
దయ చూపిస్తూ మాట్లాడే మాటలు
ఆకట్టుకుంటాయి దీనుల్ని.
(అపొ. 13:48; 16:14; కొలొ. 4:6 కూడా చూడండి.)