కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 75

‘నేనున్నాను! నన్ను పంపించు!’

‘నేనున్నాను! నన్ను పంపించు!’

(యెషయా 6:8)

  1. 1. నేడు యెహోవా పేరును

    ప్రజలెంతో నిందిస్తారు.

    క్రూరుడసమర్థుడని,

    దేవుడే లేడనంటారు.

    తొలగించి ఆ నిందలు,

    స్తుతి పాడేవారెవరు?

    (పల్లవి 1)

    ‘పంపించు యెహోవా నన్ను,

    నే నీకు స్తుతి పాడతా.

    ఇంకే ఘనతా లేదు దేవా;

    నేనున్నాను, పంపించు.’

  2. 2. ‘ఆలస్యం చేస్తాడాయన’

    అని అంటారు కొందరు.

    రాతిబొమ్మల్ని పూజిస్తూ,

    కైసరే దేవుడంటారు.

    దేవుని తీర్పు తెలిపి

    హెచ్చరించేవారెవరు?

    (పల్లవి 2)

    ‘పంపించు యెహోవా నన్ను,

    నే ధైర్యంగా హెచ్చరిస్తా.

    ఇంకే ఘనతా లేదు దేవా;

    నేనున్నాను, పంపించు.’

  3. 3. ఈ లోక స్థితిని చూసి,

    ఎందరో దుఃఖిస్తున్నారు.

    ఈ చీకట్లో ఆ దీనులు

    వెలుగు వెతుకుతారు.

    సత్యాన్ని నేర్పి వాళ్లకు

    ఓదార్పునిచ్చేదెవరు?

    (పల్లవి 3)

    ‘పంపించు యెహోవా నన్ను,

    ఓర్పుతో నేను బోధిస్తా.

    ఇంకే ఘనతా లేదు దేవా;

    నేనున్నాను, పంపించు.’

(కీర్త. 10:4; యెహె. 9:4 కూడా చూడండి.)