పాట 85
ఒకరినొకరు చేర్చుకోండి
-
1. దేవుని వాక్యం వినడానికి
వచ్చిన మీకు సుస్వాగతం!
నిత్యజీవాన్ని ఇచ్చే సత్యాలు
నేర్చుకుందాం మనం దేవుని దగ్గర.
-
2. ప్రేమగల ఈ సోదరులకై
యెహోవాకు స్తుతి చెల్లిద్దాం.
ఘనపరుద్దాం వాళ్లను మనం;
వస్తే కొత్తవాళ్లు ఆహ్వానిద్దాం మనం.
-
3. సత్యంపై ప్రేమ ఉన్నవాళ్లంతా
వింటున్నారు రాజ్య సందేశం.
క్రీస్తు మనల్ని చేర్చుకున్నట్టే,
చేర్చుకుందాం ప్రేమతో ఇతరులను.
(యోహా. 6:44; ఫిలి. 2:29; ప్రక. 22:17 కూడా చూడండి.)