కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 97

దేవుని మాట వల్లే జీవిస్తాం

దేవుని మాట వల్లే జీవిస్తాం

(మత్తయి 4:4)

  1. 1. దేవుని నోటి మాటతో

    జీవిస్తాము మనం.

    లోబడి ఉంటే పొందుతాం

    శాంతిసంతోషాలు.

    రాబోయే కొత్త లోకంలో

    జీవిస్తాం నిత్యము.

    (పల్లవి)

    దేవుని మాట వింటేనే,

    జీవిస్తాము మనం.

    రోజు కావల్సినవన్నీ

    ఉన్నాయి అందులో.

  2. 2. లేఖనాల్లో రాసున్నాయి

    సత్య గాథలెన్నో.

    నమ్మకంగా జీవించారు,

    ధైర్యం చూపించారు.

    వాళ్ల గూర్చి చదివితే,

    పొందుతాం ప్రోత్సాహం.

    (పల్లవి)

    దేవుని మాట వింటేనే,

    జీవిస్తాము మనం.

    రోజు కావల్సినవన్నీ

    ఉన్నాయి అందులో.

  3. 3. వాక్యం ద్వారా యెహోవాయే

    ఓదార్పునిస్తాడు.

    కష్టాలన్నీ సహించేలా

    జ్ఞానాన్ని ఇస్తాడు.

    దాచుకుందాం హృదయంలో

    నేర్చుకునేవన్నీ.

    (పల్లవి)

    దేవుని మాట వింటేనే,

    జీవిస్తాము మనం.

    రోజు కావల్సినవన్నీ

    ఉన్నాయి అందులో.

(యెహో. 1:8; రోమా. 15:4 కూడా చూడండి.)