పాట 109
మనస్ఫూర్తిగా ప్రగాఢమైన ప్రేమ చూపించండి
-
1. స్వచ్ఛమైన ప్రేమ అంటే,
ఎంతో ఇష్టం యెహోవాకు.
ప్రేమాస్వరూపి ఆయన,
మనకెంతో ప్రియం.
నిజమైన స్నేహబంధం,
మొదలౌతుంది ప్రేమతో.
స్వార్థమేలేని ప్రేమను
చూపిస్తాం ఎప్పుడూ.
కష్టాలొచ్చినప్పుడు,
చేయందిస్తాం మనం ప్రేమతో.
స్నేహితుల్లా ఉంటాము;
అర్థంచేసుకుంటాము.
మన ప్రభువైన యేసు
యెహోవా తండ్రి ప్రేమను
చూపాడు ఎంతో స్పష్టంగా;
హృదయాన్ని తాకాడు,
ప్రేమకర్థం నేర్పాడు.
(1 పేతు. 2:17; 3:8; 4:8; 1 యోహా. 3:11 కూడా చూడండి.)