పాట 121
మనకు ఆత్మనిగ్రహం అవసరం
-
1. మనం యెహోవానెంతో ప్రేమిస్తాం;
అయినా కావాలి ఆత్మనిగ్రహం.
పవిత్రశక్తి నిర్దేశాన్ని
పాటిస్తే, జీవం పొందుతాము.
-
2. రోజూ సాతాను శోధిస్తుంటాడు,
మనలోనూ ఉంది పాపనియమం.
కానీ సత్యమే ఎంతో మిన్న;
కాబట్టి మనం గెలవచ్చు.
-
3. మన మాటలు, చేసే పనులు
తేవాలి ఘనత మన తండ్రికి.
దానికోసమే కృషిచేస్తూ
ఆత్మనిగ్రహం చూపిద్దాము.
(1 కొరిం. 9:25; గల. 5:23; 2 పేతు. 1:6 కూడా చూడండి.)