పాట 124
ఎల్లప్పుడూ యథార్థంగా ఉందాం
-
1. అనునిత్యం యెహోవాకు
నమ్మకంగా ఉందాము.
ఆయనిచ్చే ఆజ్ఞలన్నీ
సంతోషంగా పాటిద్దాం.
ఎన్నడూ తప్పిపోనివి
దేవుని సలహాలు.
యెహోవాపై నమ్మకాన్ని
ఉంచితే ఎంతో మేలు.
-
2. అనునిత్యం సాక్షులకు
నమ్మకంగా ఉందాము.
సాయం చేస్తూ ఎల్లప్పుడూ
అండగా నిలుద్దాము.
వాళ్లపై నమ్మకముంచి,
గౌరవం చూపిద్దాము.
మాటల్లోను, చేతల్లోను
దయగా నడుద్దాము.
-
3. అనునిత్యం పెద్దలిచ్చే
ఉపదేశం విందాము.
వాళ్లు ఇచ్చే నిర్దేశాల్ని
వినయంగా పాటిద్దాం.
కుమ్మరిస్తాడు యెహోవా
మెండుగా దీవెనలు.
నమ్మకంగా ఉండేవాళ్లే
ఆయనకు పిల్లలు.
(కీర్త. 149:1; 1 తిమో. 2:8; హెబ్రీ. 13:17 కూడా చూడండి.)