కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

125వ పాట

“కరుణ చూపించేవాళ్లు సంతోషంగా ఉంటారు”

“కరుణ చూపించేవాళ్లు సంతోషంగా ఉంటారు”

(మత్తయి 5:7)

  1. 1. కరుణ చూపే యెహోవా

    ఉంటాడెంతో సంతోషంగా.

    రోజూ కరుణ చూపిస్తూ

    ఇస్తున్నాడెన్నో మనకు.

    పశ్చాత్తాపం చూపేవాళ్ల

    మొరను ఆలకిస్తాడు.

    మట్టివాళ్లని గుర్తించి,

    కనికరం చూపిస్తాడు.

  2. 2. పాపాన్ని చేసినప్పుడు,

    క్షమించమని దేవుణ్ణి

    వేడుకునే పద్ధతిని

    నేర్పాడు యేసు మనకు.

    “మేము మా ఋణస్థులను

    క్షమించినట్టే మా తండ్రీ,

    క్షమించు మా తప్పులనూ”

    అంటూ ప్రార్థించమన్నాడు.

  3. 3. దానధర్మాలు చేస్తుంటే,

    గొప్పతనాన్ని కోరక,

    ఉదారస్ఫూర్తి చూపిస్తూ

    సంతోషంగా ఇస్తూ ఉందాం.

    అప్పుడే మనం పొందుతాం

    దేవుడిచ్చే ప్రతిఫలం.

    ఆయన దృష్టిలో మనం

    ఎంతో అందంగా ఉంటాము.

(మత్త. 6:2-4, 12-14 కూడా చూడండి.)