కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

135వ పాట

యెహోవా ప్రేమతో అడుగుతున్నాడు: ‘నా కుమారుడా, జ్ఞానాన్ని సంపాదించు’

యెహోవా ప్రేమతో అడుగుతున్నాడు: ‘నా కుమారుడా, జ్ఞానాన్ని సంపాదించు’

(సామెతలు 27:11)

  1. 1. యౌవనులారా, ఇవ్వండి

    మీ హృదయం;

    నా విరోధికి ఇచ్చేలా

    జవాబును.

    సంతోషంగా సేవించండి

    ఎల్లప్పుడూ;

    చూపించండి లోకానికి

    మీ ప్రేమను.

    (పల్లవి)

    ప్రియమైన నా పిల్లల్లారా,

    జ్ఞానాన్ని సంపాదించండి;

    స్తుతించండి మనస్ఫూర్తిగా,

    సంతోషపెట్టండి నన్ను.

  2. 2. సర్వస్వాన్ని ఇస్తే నాకు

    ఆనందంగా;

    తోడుంటాను నేను మీకు

    ఎల్లప్పుడూ.

    నిరాశపర్చినా గానీ

    ఇతరులు

    ప్రేమిస్తూనే ఉంటాను

    నేను మిమ్మల్ని.

    (పల్లవి)

    ప్రియమైన నా పిల్లల్లారా,

    జ్ఞానాన్ని సంపాదించండి;

    స్తుతించండి మనస్ఫూర్తిగా,

    సంతోషపెట్టండి నన్ను.