కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

136వ పాట

యెహోవా “తగిన జీతాన్ని” ఇస్తాడు

యెహోవా “తగిన జీతాన్ని” ఇస్తాడు

(రూతు 2:12)

  1. 1. పూర్ణ ప్రాణంతో సేవించేవాళ్లను

    యెహోవా మరచిపోడు.

    దైవభక్తితో సేవ చేయాలంటే,

    వదులుకోవాలి కొన్ని.

    కుటుంబ సభ్యుల్ని, స్నేహితులను

    వదులుకునే వాళ్లకు

    ఇస్తాడు సోదర బృందాన్ని నేడు;

    నిత్యజీవాన్ని త్వరలో.

    (పల్లవి)

    యెహోవాయే ఇస్తాడు దీవెన,

    సంపూర్ణ బహుమతిని కూడా.

    ఉండండి రెక్కల చాటున,

    యెహోవా ఏనాడూ మాట తప్పడు.

  2. 2. జీవితమంతా కష్టాలూ కన్నీళ్లే

    అనిపించొచ్చు మనకు.

    వీటికి తోడు జీవన చింతలు

    ముంచెత్తవచ్చు మనల్ని.

    ఓదార్పునిచ్చే మన దేవునికి

    తెలుసు మీకేం కావాలో.

    పవిత్రశక్తిని, వాక్యాన్ని ఇచ్చి

    సాయం చేస్తాడు తప్పక.

    (పల్లవి)

    యెహోవాయే ఇస్తాడు దీవెన,

    సంపూర్ణ బహుమతిని కూడా.

    ఉండండి రెక్కల చాటున,

    యెహోవా ఏనాడూ మాట తప్పడు.

(న్యాయా. 11:38-40; యెష. 41:10 కూడా చూడండి.)