పాట 138
తలనెరుపులో ఉన్న సొగసు
-
1. యౌవనం గతించిన
వృద్ధులెందరో.
చేస్తున్నారు సేవను
నమ్మకముగా.
కోల్పోయారు కొందరు
భాగస్వామిని;
తండ్రి, నీవే వాళ్లకు
ఇవ్వు శక్తిని.
(పల్లవి)
తండ్రి, నీపై వాళ్లు
చూపిన ప్రేమ
గుర్తు చేసుకుని,
దీవెన ఇవ్వు.
-
2. నీతి ప్రవర్తనతో
వస్తుంది అందం;
వృద్ధులు యెహోవాకు
ఔతారు ప్రియం.
గుర్తుంచుకుందాం దీన్ని
ఎప్పుడూ మనం:
సేవించారు దేవుణ్ణి
పూర్ణశక్తితో.
(పల్లవి)
తండ్రి, నీపై వాళ్లు
చూపిన ప్రేమ
గుర్తు చేసుకుని,
దీవెన ఇవ్వు.
(కీర్త. 71:9, 18; సామె. 20:29; మత్త. 25:21, 23; లూకా 22:28; 1 తిమో. 5:1 కూడా చూడండి.)