కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 139

కొత్త లోకంలో మిమ్మల్ని చూసుకోండి!

కొత్త లోకంలో మిమ్మల్ని చూసుకోండి!

(ప్రకటన 21:1-5)

  1. 1. స్వేచ్ఛా, శాంతి ఉండే లోకం

    మనందరం చూస్తాము త్వరలో.

    దుష్టత్వమే ఉండదిక,

    నీతి వర్ధిల్లు ఆ రాజ్యంలో.

    అంతేలేని ఆ పాలన

    తెస్తుందెన్నో ఆశీర్వాదాలు.

    ఊహించండి మీరున్నట్టు అక్కడ,

    నిండు హృదయంతో

    కీర్తిస్తాము మనం:

    (పల్లవి)

    యెహోవా దేవా, మహా అద్భుతం!

    క్రీస్తు రాజ్యంలో అంతా నూతనం.

    మా స్తుతి గీతాలు ఆలకించు దేవా;

    నీకే చెల్లాలి మహిమ, ప్రభావము.

  2. 2. ఎంతో రమ్యం దైవ రాజ్యం,

    భీతిభయం లేనేలేవు ఇక;

    సొంతమైంది కొత్త భూమి,

    నిజం చేశాడు వాగ్దానాన్ని.

    తోడున్నాడు యెహోవాయే,

    ఆ నీడ కిందే ఉన్నాం మనం.

    మృతులందర్నీ లేపుతాడాయన,

    ఐక్యంగా దేవుణ్ణి

    స్తుతిస్తాం అందరం:

    (పల్లవి)

    యెహోవా దేవా, మహా అద్భుతం!

    క్రీస్తు రాజ్యంలో అంతా నూతనం.

    మా స్తుతి గీతాలు ఆలకించు దేవా;

    నీకే చెల్లాలి మహిమ, ప్రభావము.