పాట 144
మీ దృష్టి లక్ష్యంపై ఉంచండి!
-
1. చూస్తారు మళ్లీ గుడ్డివాళ్లు.
చెవిటి వాళ్లంతా వింటారు.
పిల్లలు గానాలు చేస్తారు.
చూస్తాం శాంతిసంతోషాలు.
బ్రతికొస్తారు ఆత్మీయులు;
మరణం అనేదే ఉండదు.
(పల్లవి)
మనము ఆ కాలాన్ని చూస్తాం,
దృష్టి లక్ష్యము పైనుంటే.
-
2. గొర్రెలు, తోడేళ్లు మేయగా,
ఆవులు, ఎలుగుల్ ఆడగా,
బాలుడు ఔతాడు కాపరి;
వింటాయవి వాని మాట.
కన్నీళ్లు గతించిపోతాయి;
బాధలు, భయాలు ఉండవు.
(పల్లవి)
మనము ఆ కాలాన్ని చూస్తాం,
దృష్టి లక్ష్యము పైనుంటే.
(యెష. 11:6-9; 35:5-7; యోహా. 11:24 కూడా చూడండి.)