కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరిపాలక సభ నుండి ఉత్తరం

పరిపాలక సభ నుండి ఉత్తరం

‘మీరు బోధకులుగా ఉండాలి.’ (హెబ్రీ. 5:12) ఒకసారి ఊహించండి. విశ్వంలో అత్యంత గొప్ప బోధకుడైన యెహోవా తన గురించి ఇతరులకు బోధించడానికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు! కుటుంబంలో గానీ, సంఘంలో గానీ, పరిచర్యలో గానీ యెహోవా గురించి సత్యాన్ని బోధించడం మనకు దొరికిన గొప్ప అవకాశం, పెద్ద బాధ్యత. మరి ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తించాలంటే ఏమి చేయాలి?

దానికి జవాబు, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన ఈ మాటల్లో ఉంది: ‘బహిరంగంగా చదివే విషయంలో, ప్రోత్సహించే విషయంలో, బోధించే విషయంలో కృషిచేస్తూ ఉండు . . . అలాచేస్తే నిన్ను నువ్వు రక్షించుకుంటావు, నీ బోధ వినేవాళ్లను కూడా రక్షిస్తావు.’ (1 తిమో. 4:13, 16) మీ దగ్గర ప్రాణాల్ని రక్షించే సందేశం ఉంది. కాబట్టి చదివే, బోధించే విషయంలో మెరుగవ్వడానికి కృషిచేయడం ప్రాముఖ్యం. మీకు ఈ విషయంలో సహాయం చేయడానికే ఈ బ్రోషురును తయారుచేశారు. దీంట్లో ఉన్న కొన్ని ప్రత్యేకతలు గమనించండి.

ప్రతీ పేజీ పైన ఉండే లేఖనంలో, ఆ పేజీలో చర్చించే ప్రసంగ లక్షణానికి సంబంధించిన బైబిలు సూత్రం ఉండొచ్చు లేదా ఉదాహరణ ఉండొచ్చు

యెహోవాయే ‘మహాగొప్ప ఉపదేశకుడు.’ (యెష. 30:20, NW) చదివే, బోధించే విషయంలో మీ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి ఈ బ్రోషురు సహాయం చేస్తుందన్న మాట నిజమే. కానీ, మన సందేశానికి మూలం యెహోవాయే అని, ఆయనే ప్రజల్ని ఆకర్షిస్తాడని ఎప్పుడూ మర్చిపోకండి. (యోహా. 6:44) అందుకే, పవిత్రశక్తి కోసం పదేపదే ప్రార్థించండి. దేవుని వాక్యాన్ని ఎక్కువగా ఉపయోగించండి. వినేవాళ్ల దృష్టిని మీవైపు కాకుండా ఎప్పుడూ యెహోవా వైపే మళ్లించండి. వాళ్లు ఆయన మీద బలమైన ప్రేమ పెంచుకునేందుకు సహాయం చేయండి.

మానవ చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యమైన సందేశాన్ని బోధించడానికి దేవుడు మిమ్మల్ని ఆహ్వానించాడు. “దేవుడిచ్చే బలం” మీద ఆధారపడుతూ మీరు ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తారని మేము నమ్ముతున్నాం.—1 పేతు. 4:11.

మీ తోటి బోధకులు,

యెహోవాసాక్షుల పరిపాలక సభ