కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 3

ప్రశ్నలు వేయడం

ప్రశ్నలు వేయడం

మత్తయి 16:13-16

ఏమి చేయాలి? వినేవాళ్లలో ఆసక్తి కలిగించి దాన్ని నిలబెట్టడానికి, వాళ్లను ఆలోచింపజేయడానికి, ముఖ్యమైన విషయాలను నొక్కిచెప్పడానికి గౌరవపూర్వకంగా ప్రశ్నలు వేయండి.

ఎలా చేయాలి?

  • ఆసక్తి కలిగించి, దాన్ని నిలబెట్టండి. వినేవాళ్లు మనసులో జవాబు చెప్పుకునేలా లేదా వాళ్ల ఆసక్తి పెరిగేలా ప్రశ్నలు వేయండి.

  • ఆలోచింపజేయండి. వినేవాళ్లు మీరు చెప్తున్న విషయాన్ని అర్థం చేసుకుని దాన్ని నమ్మేలా కొన్ని ప్రశ్నలు వేయండి.

  • ముఖ్యమైన విషయాలను నొక్కిచెప్పండి. ఏదైనా ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పే ముందు ఆసక్తి కలిగించే ప్రశ్న వేయండి. ముఖ్యమైన విషయాన్ని వివరించిన తర్వాత గానీ, మీ ప్రసంగం ముగింపులో గానీ మీరు మాట్లాడిన విషయం మీద ప్రశ్నలు వేయండి.