కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 5

తప్పులు లేకుండా చదవడం

తప్పులు లేకుండా చదవడం

1 తిమోతి 4:13

ఏమి చేయాలి? పేజీలో ఉన్న సమాచారాన్ని ఉన్నదున్నట్లు గట్టిగా చదవండి.

ఎలా చేయాలి?

  • బాగా సిద్ధపడండి. మీరు చదువుతున్న సమాచారాన్ని ఎందుకు రాశారో ఆలోచించండి. పదాలను విడివిడిగా కాకుండా, కలిపి చదవాల్సిన పదాలను కలిపి చదవడం ప్రాక్టీసు చేయండి. కొత్త పదాలను చేర్చడం, కొన్నిటిని మింగేయడం, వేరే పదాలు పెట్టి చదవడం చేయకండి. విరామ చిహ్నాలన్నీ (కామా, ఫుల్‌స్టాప్‌ లాంటివి) చూసుకోండి.

  • ప్రతీ పదాన్ని సరిగ్గా పలకండి. ఒక పదాన్ని ఎలా పలకాలో తెలియకపోతే ఆ ప్రచురణ ఆడియో రికార్డింగ్‌ వినండి, లేదా బాగా చదివేవాళ్ల సహాయం తీసుకోండి.

  • స్పష్టంగా మాట్లాడండి. మీ తల ఎత్తి, నోటిని పూర్తిగా తెరిచి పదాలను జాగ్రత్తగా పలకండి. ప్రతీ అక్షరాన్ని పలకడానికి కృషిచేయండి.