కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 12

ఆప్యాయత, సహానుభూతి

ఆప్యాయత, సహానుభూతి

1 థెస్సలొనీకయులు 2:7, 8

ఏమి చేయాలి? మీరు వినేవాళ్లను ప్రేమిస్తున్నారని, వాళ్ల మీద శ్రద్ధ ఉందని చూపించేలా మాట్లాడండి.

ఎలా చేయాలి?

  • వినేవాళ్ల గురించి ఆలోచించండి. వినేవాళ్లు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో గుర్తుచేసుకొని మీ హృదయాన్ని సిద్ధం చేసుకోండి. వాళ్లకు ఎలా అనిపిస్తుందో ఊహించడానికి ప్రయత్నించండి, అంటే సహానుభూతి చూపించండి.

  • మీ మాటల్ని జాగ్రత్తగా ఎంచుకోండి. వినేవాళ్లను సేదదీర్చడానికి, ఓదార్చడానికి, ఉత్తేజపర్చడానికి ప్రయత్నించండి. వాళ్లను బాధపెట్టే మాటలు ఉపయోగించకండి. సాక్షులుకాని వాళ్లను లేదా వాళ్ల నమ్మకాలను కించపర్చేలా మాట్లాడకండి.

  • శ్రద్ధ చూపించండి. దయగల స్వరంతో, సరైన సంజ్ఞలతో వినేవాళ్ల మీద మీకు నిజంగా శ్రద్ధ ఉందని చూపించండి. మీ ముఖకవళికల్లో కూడా దాన్ని చూపించండి. తరచూ చిరునవ్వు చిందించండి.