కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 15

గట్టి నమ్మకంతో చెప్పడం

గట్టి నమ్మకంతో చెప్పడం

1 థెస్సలొనీకయులు 1:5

ఏమి చేయాలి? మీరు చెప్తున్న సమాచారం నిజమని, ప్రాముఖ్యమని గట్టిగా నమ్ముతున్నట్లు చూపించండి.

ఎలా చేయాలి?

  • బాగా సిద్ధపడండి. ముఖ్యమైన విషయాలు ఏమిటో, అవి నిజమని బైబిలు ఎలా నిరూపిస్తుందో అర్థమయ్యేంత వరకు సమాచారాన్ని బాగా చదవండి. ముఖ్యాంశాలను తేలిగ్గా అర్థమయ్యే మాటల్లో చెప్పడానికి ప్రయత్నించండి. వినేవాళ్లకు సమాచారం ఎలా ఉపయోగపడుతుందో బాగా ఆలోచించండి. పవిత్రశక్తి కోసం ప్రార్థించండి.

  • మీకు గట్టి నమ్మకం ఉందని చూపించే మాటలు ఉపయోగించండి. ప్రచురణలో ఉన్న మాటల్ని ఉన్నదున్నట్లు చెప్పే బదులు, సొంత మాటల్లో చెప్పండి. మీరు చెప్తున్న సమాచారం మీద మీకు గట్టి నమ్మకం ఉందని చూపించే మాటలు ఎంచుకోండి.

  • మీకు నిజంగా నమ్మకం కుదిరిందని చూపించండి. తగినంత స్వరంతో మాట్లాడండి. మీ సంస్కృతిలో తప్పు కాకపోతే ప్రేక్షకుల కళ్లల్లోకి చూసి మాట్లాడండి.