కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 17

అర్థమయ్యేలా చెప్పడం

అర్థమయ్యేలా చెప్పడం

1 కొరింథీయులు 14:9

ఏమి చేయాలి? మీరు చెప్పే విషయం వినేవాళ్లకు అర్థమయ్యేలా చూడండి.

ఎలా చేయాలి?

  • సమాచారాన్ని బాగా చదవండి. ముందుగా సమాచారాన్ని బాగా అర్థం చేసుకోండి. అప్పుడు మీరు దాన్ని తేలిగ్గా అర్థమయ్యేలా సొంత మాటల్లో వివరించగలుగుతారు.

  • చిన్నచిన్న వాక్యాలు, తేలిగ్గా అర్థమయ్యే మాటలు ఉపయోగించండి. పెద్దపెద్ద వాక్యాలు ఉపయోగించడం తప్పు కాకపోయినా, చిన్నచిన్న మాటలు, వాక్యాలు ఉపయోగిస్తూ ముఖ్యమైన విషయాలు వివరించండి.

  • తెలియని పదాలు వివరించండి. వీలైనంతవరకు, వినేవాళ్లకు తెలియని మాటలు ఉపయోగించకండి. ఒకవేళ వాళ్లకు తెలియని పదాన్ని గానీ, బైబిల్లోని వ్యక్తిని గానీ, ప్రాచీన కొలతను గానీ, ఆచారాన్ని గానీ ప్రస్తావించాల్సి వస్తే, వాటి గురించి కాస్త వివరించండి.