కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

4వ పాఠం

దేవుడు ఎవరు?

దేవుడు ఎవరు?

వేల సంవత్సరాలుగా ప్రజలు ఎంతోమంది దేవుళ్లను, దేవతల్ని పూజిస్తున్నారు. కానీ, ఒక దేవుడు “ఇతర దేవుళ్లందరి కన్నా గొప్పవాడు” అని బైబిలు చెప్తుంది. (2 దినవృత్తాంతాలు 2:5) ఆయన ఎవరు? ప్రజలు పూజించే మిగతా దేవుళ్లందరి కన్నా ఆయనే ఎందుకు గొప్పవాడు? ఆయన తనను తాను మీకెలా పరిచయం చేసుకుంటున్నాడో ఈ పాఠంలో తెలుసుకుందాం.

1. దేవుని పేరు ఏంటి? మనం ఆ పేరు తెలుసుకోవాలన్నది ఆయన కోరికని ఎలా చెప్పవచ్చు?

దేవుడు బైబిలు ద్వారా తనను తాను మనకు పరిచయం చేసుకుంటున్నాడు: “నేను యెహోవాను. ఇదే నా పేరు.” (యెషయా 42:5, 8 చదవండి.) “యెహోవా” అనే పేరు హీబ్రూ భాష నుండి వచ్చింది. ఆ పేరుకు “ఆయన అయ్యేలా (జరిగేలా) చేస్తాడు” అనే అర్థముందని చాలామంది భాషా పండితులు చెప్తున్నారు. మనం తన పేరు తెలుసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. (నిర్గమకాండం 3:15) అలాగని ఎలా చెప్పవచ్చు? బైబిల్లో ఆయన తన పేరును 7,000 కన్నా ఎక్కువసార్లు రాయించాడు! a అవును, “పైన ఆకాశంలో, కింద భూమ్మీద” ఒక్కడే సత్యదేవుడు ఉన్నాడు, ఆయన పేరు యెహోవా.—ద్వితీయోపదేశకాండం 4:39.

2. బైబిలు యెహోవా గురించి ఏం చెప్తుంది?

మనుషులు పూజించే దేవుళ్లందరిలో యెహోవాయే నిజమైన దేవుడని బైబిలు చెప్తుంది. ఎందుకు? కొన్ని కారణాలు చూడండి. యెహోవా మాత్రమే “భూమంతటి పైన మహోన్నతుడు,” అంటే ఆయనకు అందరి మీద అధికారం ఉంది. (కీర్తన 83:18 చదవండి.) ఆయన “సర్వశక్తిమంతుడు,” ఏది చేయాలనుకుంటే అది చేసే శక్తి ఆయనకు ఉంది. ఆయన ఈ విశ్వాన్ని, భూమ్మీదున్న ప్రాణుల్ని, ‘అన్నిటినీ సృష్టించాడు.’ (ప్రకటన 4:8, 11) అంతేకాదు, యెహోవా మాత్రమే ఎప్పటినుండో ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు.—కీర్తన 90:2.

ఎక్కువ తెలుసుకోండి

దేవుని పేరుకు, ఆయన బిరుదులకు ఉన్న తేడాను గమనించండి. దేవుడు మనకు తన పేరును ఎలా తెలియజేస్తున్నాడో, ఎందుకు తెలియజేస్తున్నాడో చూడండి.

3. దేవునికి చాలా బిరుదులు ఉన్నా, పేరు మాత్రం ఒక్కటే ఉంది

పేరుకు, బిరుదులకు ఉన్న తేడా తెలుసుకోవడానికి వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

  • దేవుని బిరుదులకు, ఆయన పేరుకు ఉన్న తేడా ఏంటి?

ప్రజలు చాలామంది దేవుళ్లను, ప్రభువులను పూజిస్తారని బైబిలు అంటోంది. కీర్తన 136:1-3 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • “దేవాది దేవుడు,” “ప్రభువుల ప్రభువు” ఎవరు?

4. మీరు తన పేరు తెలుసుకుని, ఆ పేరుతో పిలవాలని యెహోవా కోరుకుంటున్నాడు

మీరు తన పేరు తెలుసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. అలాగని ఎలా చెప్పవచ్చు? వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

  • తన పేరు అందరూ తెలుసుకోవాలన్నది యెహోవా కోరిక అని మీకు అనిపిస్తుందా? ఎందుకు?

ప్రజలు తన పేరు ఉపయోగించి ప్రార్థించాలని యెహోవా కోరుకుంటున్నాడు. రోమీయులు 10:13 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • యెహోవా దేవుని పేరు ఉపయోగించడం ఎంత ప్రాముఖ్యం?

  • ఎవరైనా మీ పేరు గుర్తుపెట్టుకొని మిమ్మల్ని పేరుతో పలకరిస్తే మీకెలా అనిపిస్తుంది?

  • మీరు యెహోవాను ఆయన పేరుతో పిలిస్తే ఆయనకు ఎలా అనిపిస్తుంది?

5. మీరు తనకు దగ్గరవ్వాలని యెహోవా కోరుకుంటున్నాడు

దేవుని పేరు తెలుసుకోవడం కన్నా గొప్ప సంతోషం ఇంకొకటి ఉండదు అని సొటెన్‌ అనే ఆమె చెప్తుంది. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

  • దేవుని పేరు తెలుసుకోవడం వల్ల సొటెన్‌ జీవితం ఎలా మారిపోయింది?

మీరు ఎవరితోనైనా స్నేహం చేయాలనుకుంటే, ముందుగా వాళ్ల పేరు తెలుసుకుంటారు కదా. యాకోబు 4:8 ఎ చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • యెహోవా మిమ్మల్ని ఏమని ఆహ్వానిస్తున్నాడు?

  • దేవుని పేరు తెలుసుకుని, ఆయన్ని ఆ పేరుతో పిలవడం వల్ల మీరు ఆయనకు దగ్గరవ్వవచ్చని అనిపిస్తుందా? ఎందుకు?

కొంతమంది ఇలా అంటారు: “దేవుణ్ణి ఏ పేరుతో పిలిచినా ఫర్వాలేదు.”

  • దేవుని పేరు యెహోవా అని మీరు నమ్ముతున్నారా?

  • ప్రజలు తనను తన పేరుతో పిలవాలన్నది దేవుని కోరికని మీరు వాళ్లకు ఎలా వివరిస్తారు?

ఒక్కమాటలో

నిజమైన దేవుడు ఒక్కడే, ఆయన పేరు యెహోవా. మనం ఆ పేరు తెలుసుకుని, తనను ఆ పేరుతో పిలవాలని, అలా తనకు దగ్గరవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు.

మీరేం నేర్చుకున్నారు?

  • ప్రజలు పూజించే మిగతా దేవుళ్లందరి కన్నా యెహోవా ఎందుకు గొప్పవాడు?

  • మనం దేవుణ్ణి ఆయన పేరుతో ఎందుకు పిలవాలి?

  • మీరు తనకు దగ్గరవ్వాలన్నది యెహోవా కోరికని ఎలా చెప్పవచ్చు?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

దేవుడు ఉన్నాడని నమ్మడానికి ఐదు బలమైన రుజువులు పరిశీలించండి.

“దేవుడు నిజంగా ఉన్నాడా?” (jw.org ఆర్టికల్‌)

దేవుడు ఎప్పటినుండో ఉన్నాడని, ఎప్పటికీ ఉంటాడని నమ్మడం ఎందుకు సరైనదో తెలుసుకోండి.

“దేవుణ్ణి ఎవరు సృష్టించారు?” (కావలికోట, అక్టోబరు-డిసెంబరు 2014)

దేవుని పేరును పూర్వ కాలంలో ఎలా పలికేవాళ్లో తెలియకపోయినా మనం దాన్ని ఎందుకు ఉపయోగించాలో చూడండి.

“యెహోవా ఎవరు?” (jw.org ఆర్టికల్‌)

దేవుణ్ణి ఎలా పిలిచినా ఫర్వాలేదా? ఆయనకు ఒకేఒక్క పేరు ఉందని మనం ఎందుకు చెప్పవచ్చో తెలుసుకోండి.

“దేవునికి ఎన్ని పేర్లు ఉన్నాయి?” (jw.org ఆర్టికల్‌)

a దేవుని పేరుకు ఉన్న అర్థం గురించి ఎక్కువ తెలుసుకోవడానికి, అలాగే కొన్ని బైబిలు అనువాదాల్లో ఆ పేరు ఎందుకు తీసేశారో తెలుసుకోవడానికి పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదంలో అనుబంధం A4 చూడండి.